హోమ్లీ గర్ల్ నిత్యామీనన్ తెలుగులో నటించిన సినిమాలు చాల తక్కువే అయినా మంచి నటిగా గుర్తింపు ఉంది. కొంతమంది దర్సకులైతే ఈమెను ఒకనాటి సౌందర్య తో పోలుస్తూ ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. ప్రస్తుతం 100 కోట్ల బడ్జెట్ సినిమాగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ సినిమా నిర్మాణ కార్యక్రమాలలో అత్యంత బిజీగా ఉన్న రాజమౌళి బాహుబలి సినిమా 2015 వరకు రాదు కాబట్టి నిత్యామీనన్ హీరోయిన్ గా చేసి ఒక చిన్న సినిమా ప్రస్తుత మహిళల సమస్యల పై నిర్మిస్తాడు అంటు వార్తలు వినపడుతున్నాయి.  ఈ వార్తలు రావడానికి కల ప్రధానకారణం రాజమౌళి ఈమధ్య ఒకనాటి హీరోయిన్ శ్రీప్రియ దర్శకత్వం వహించిన ‘మాలిని 22’ సినిమా రషస్ చూసాడట. ఇందులో నాయక పాత్ర పోషించిన నిత్యామీనన్ నటనకు ఫ్లాట్ అయిపోయిన రాజమౌళి నిత్యకు మంచి పర్సనాలిటి ఉంటే ‘బాహుబలి’ లోనే అవకాసం ఇచ్చేవాడినని అంటు నిత్య కోసమే నేటి అమ్మాయిలు ఎదుర్కుంటున్న సమస్యలపై ఒక మంచి సినిమాను త్వరగా తీసి వచ్చే సంవత్సరమే విడుదల చేసి దర్శకుడిగా తన క్రేజ్ తగ్గిపోకుండా చూసుకోవడానికి ఆలోచనలు చేస్తున్నాడు అంటు వార్తలు తెగ వినడుతున్నాయి.  అయితే ఈసినిమాకు రాజమౌళి నిర్మాతగా వ్యవహిస్తూ దర్శకత్వం కూడా చేస్తాడా లేదంటే తన డైరక్షన్ టీమ్ లోని ఎవరైనా ఒక చాకులాంటి కుర్రాడికి ఈ అవకాసం ఇస్తాడ అంటు వార్తలు వినిపిస్తున్నాయి. ఈవార్తలే నిజమైతే నిత్యామీనన్ దశ తిరిగిందనే అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: