స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ న‌టిస్తున్న అప్ క‌మింగ్ మూవీ రేసుగుర్రం షూటింగ్‌ను శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. రీసెంట్‌గా స్పెయిన్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న రేసు గుర్రం హైద‌రాబాద్ లోకేష‌న్స్‌లో మిగ‌తా టాకీ పార్ట్‌ను పూర్తి చేసుకుంటుంది. ప్రస్తుతం రేసుగుర్రం మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటిలో జ‌రుపుకుంటుంది. రేసుగుర్రం మూవీలోని యాక్షన్ స‌న్నివేశాల‌ను ఫిల్మ్‌సిటీలో షూట్ చేస్తున్నారు. అలాగే యాక్షన్ సీక్వెల్స్‌ను హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూట్ చేస్తున్నారు. ఈ నెల చివ‌రికి రేసుగుర్రం మూవీకు సంబంధించిన షూటింగ్ దాదాపు తొంబైశాతం పూర్తవుతుంద‌ని చిత్ర యూనిట్ నుండి అందిన స‌మాచారం. ఈ మూవీను జ‌న‌వరిలో రిలీజ్ చేసేందుకు ప్లానింగ్స్ జ‌రుగుతున్నాయి. జ‌న‌వ‌రి నెల‌లో సంక్రాంతి కానుక‌గా చాలా మూవీలు రిలీజ్ అవుతుండ‌టంతో రేసుగుర్రం మూవీను ఫిబ్రవ‌రి నెల‌లో రిలీజ్ చేస్తున్నార‌ని టాలీవుడ్ స‌మాచారం. ఫిబ్రవ‌రి ప‌ద్నాలుగున‌ ల‌వ‌ర్స్ డే సంద‌ర్భంగా రేసుగుర్రం రిలీజ్ కావ‌చ్చు అని మెగా కాంపౌండ్ నుండి అందిన స‌మాచారం. ఈ యాక్షన్ ఎంట‌ర్టైన‌ర్ మూవీను సురేంద‌ర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. అల్లు అర్జున్‌ స‌ర‌స‌న శృతిహాస‌న్‌, స‌లోని హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ మూవీకు స‌క్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రొడ్యూజ‌ర్ న‌ల్లమ‌లుపు బుజ్జి రేసుగుర్రం మూవీను రాజీ ప‌డ‌కుండా నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: