ప్రస్తుతం భాగ్యనగరంలో అంతర్జాతీయ చిల్డ్రన్ ఫెస్టివల్ జరుగుతోంది. దాదాపు 48 దేశాల ప్రతినిధులు వారు నిర్మించిన సినిమాలు భాగ్యనగరంలోని చాల ధియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఎలట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వెబ్ మీడియాల దృష్టి అంతా రాష్ట్ర విభజన సమస్య పై ఉండటంతో ఈ చిల్డ్రన్ ఫెస్టివల్ కు అనుకున్నంత మీడియా కవరేజ్ రావడంలేదు.  అయినా చాల మంచి, పిల్లల సినిమాలు ఈ ఫెస్టివల్ కు వచ్చినట్లుగా తెలుస్తోంది. నవంబర్ 14న ప్రారంభం అయిన ఈ ఫెస్టివల్ ఈరోజు ముగింపుకు వస్తోంది. ఈ ఫెస్టివల్ ను బాలీవుడ్ క్రేజీ హీరో రణబీర్ కపూర్ ప్రారంభించాడు. ఈరోజు జరగబోతున్న ముగింపు ఉత్సవానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్న చిల్డ్రన్ ఫిలిం సొసైటీ ముఖ్య అతిధిగా పిలిచినట్లుగా వార్తలు వస్తున్నాయి. పవన్ అభిమానుల క్రేజ్ రీత్యా ఈ వార్తను చివరి నిముషంలో ప్రకటిస్తారు అని అంటున్నారు.  గత వారంరోజులుగా ఈ ఫెస్టివల్ మన రాజధానిలో జరుగుతున్నా మన టాలీవుడ్ సెలెబ్రెటీలు ఎవ్వరూ ఈ ఉత్సవం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కానీ తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం పవన్ ఈ ముగింపు ఉత్సవానికి ముఖ్య అతిధిగా హాజర అవుతాడు అని అంటున్నారు. పవన్ కు చిన్న పిల్లలంటే ఉన్న విపరీతమైన అభిమానం పవర్ స్టార్ చేత ఈ ఉత్సవాలకు వచ్చేటట్లుగా చేసింది అని టాక్. ఈ వార్తలే నిజమైతే పవన్ కళ్యాణ్ పాల్గొంటున్న మొట్టమొదటి ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా రికార్డుకేక్కుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: