హీరో అనేవాడు ఇలాక్కూడా ఉండొచ్చా అనిపిస్తుంది ధనుష్ ని చూస్తే. కొత్తలో అయితే మరీ పుల్లలా ఉండేవాడు. వీడేం హీరోరా బాబూ అని బహిరంగంగా సెటైర్లు కూడా వేశారు కొందరు. కానీ అతడి నటన చూశాక అలా అన్నవాళ్లకి దిమ్మదిరిగిపోయింది. మళ్లీ ధనుష్ కి వ్యతిరేకంగా వాళ్లెవరి నోళ్లూ తెరచుకోలేదు. ముఖం అద్దంలో చూసుకో అనిపించుకుని, తర్వాత స్టార్లు అయినవాళ్లు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. వాళ్లందరి గురించీ తెలుసు కాబట్టే తన మీద వచ్చిన విమర్శలను, తనను అవమానించేలా చేసిన కామెంట్లను పట్టించుకుని ఉండడు ధనుష్. కేవలం నటననే నమ్ముకున్నాడు తానేంటో చూపించాడు. ఇప్పుడతడో బిజీ హీరో. నిర్మాత. గాయకుడు. ఇంకా చెప్పాలంటే... ఆల్ రౌండర్. అయితే రాంఝనా సక్సెస్ అయ్యింది కదా అని కంగారు పడిపోయి వేరే సినిమాలు మొదలు పెట్టేయలేదు ధనుష్. జాగ్రత్తగా వచ్చిన కథలన్నీ విన్నాడు. ఆచి తూచి బాగా ఆలోచించి ఇప్పటికి మరో సినిమాని ఓకే అన్నాడు. చీనీ కమ్ చిత్ర దర్శకుడు బల్కి డైరెక్షన్లో తన రెండో బాలీవుడ్ చిత్రాన్ని చేయనున్నాడు. కమల్ చిన్న కూతురు అక్షర ఈ చిత్రంతో నటిగా మారనుంది. ఇందులో అమితాబ్ ఓ ప్రత్యేక పాత్రను చేస్తున్నారు. దాంతో చాలా ఎగ్జయిటైపోతున్నాడు ధనుష్. అతగాడు బిగ్ బీకి వీర ఫ్యాను. అలాంటిది ఏకంగా ఆయనతోనే కలసి నటించబోతున్నానా అని తలచుకుని తలచుకుని మురిసిపోతున్నాడు. ఎందుకు ధనుష్ అంత ఆశ్చర్యం... యు డిజర్వ్ ఇట్!

మరింత సమాచారం తెలుసుకోండి: