అందమైన అమ్మాయి అడిగితే ఎంతటి మగాడయినా కాదనలేడు అంటారు కదా! అందుకే అనుకుంటా... కరీనా కపూర్ నోరు తెరచి సల్లూభాయ్ ని రెండు కోరికలు కోరింది. కానీ పాపం అతగాడు ఒక్కదానికి కూడా ఒప్పుకోలేదు. మనసులో బాధపడిందో ఏమో తెలీదు కానీ... పైకి మాత్రం నవ్వేసి ఊరుకుంది కరీనా. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ షోకి... తన కొత్త సినిమా గోరీ తేరే ప్యార్ మే ప్రమోషన్ కోసం ఇమ్రాన్ ఖాన్ తో కలసి వచ్చింది కరీనా. ఏదో గెస్టుగా వచ్చినట్టు ఫీలవకుండా నానా అల్లరీ చేసింది. అందరినీ అలరించింది. సల్మాన్ తో కలసి సందడి చేసింది. సల్మాన్ ఆటపట్టించింది కూడా. సాధారణంగా ఎక్కువ మాట్లాడని కరీనా అలా హుషారుగా ఉండేసరికి ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అయితే ఈ ప్రోగ్రాములో కరీనా సల్లూని రెండు కోరికలు కోరింది. మొదటిది... షర్ట్ విప్పమని. ప్రతి సినిమాలోనూ చొక్కా విప్పేసి కండలు ప్రదర్శిస్తుంటాడు కదా! అందుకే అలా అంది. అయితే అతగాడు విప్పలేదు. సిగ్గుపడినట్టుగా నటించి టాపిక్ డైవర్ట్ చేశారు. తరువాత దబాంగ్ లో తనకు చాన్స్ ఇవ్వమని అడిగింది కరీనా. అయితే ఆమె డైరెక్టుగా కాకుండా కాస్త ఇన్ డైరెక్టుగానే అంది. దబాంగ్ 10 నన్ను హీరోయిన్ గా తీసుకోండి అని జోక్ చేసినట్టుగా చేసింది. సల్మాన్ కూడా దాన్ని జోకులాగే తీసుకుని, తప్పకుండా ఇస్తాను నీకు నా బామ్మ వేషం అన్నాడు. ముందు మూడో భాగం రానివ్వు, పదోదాని గురించి అప్పుడు చూద్దాం అన్నాడు. అయితే కరీనా జోక్ చేసినట్టు అంది కానీ అది ఆమె మనసులో కోరికే అయివుంటుందని అందరూ అంటున్నారు. ఆ విషయం సల్మాన్ కి కూడా తెలుసని, అందుకే తెలివిగా తప్పించుకున్నాడని కూడా అంటున్నారు. రెండు తెలివైన తలకాయలు మాట్లాడుకుంటే ఇలా ఉంటుందన్నమాట!  

మరింత సమాచారం తెలుసుకోండి: