మీడియాకు, ఛానల్స్ కు పవన్ చాల దూరంలో ఉంటాడు. సామాన్యంగా పెద్దపెద్ద సేలెబ్రేటీలు అంతా తరుచు ఎలట్రానిక్ మీడియాలో కనిపించడానికి ఉత్సాహపడుతూ ఉంటే పవన్ మాత్రం మీడియాకు అందకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. చాల సంవత్సరాలు తరువాత తనకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ‘అత్తారింటి దారేది’ సినిమా కోసం టివీల ముందుకు వచ్చాడు పవన్. అటువంటి పవన్ కళ్యాణ్ తో ఒక గంటన్నర పాటు ఇంటర్వ్యూ కార్యక్రమం అంటే ఇంక ఆరోజు పవన్ అభిమానులకే కాదు సాధారణ ప్రజానికానికి కూడ అది సంచలనమే.  ఇటువంటి ప్రయత్నానికి ఒక ప్రముఖ న్యూస్ చానల్ ప్రయత్నిస్తోంది అంటు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు న్యూస్ ఛానల్స్ లో మంచి రేటింగ్ ఉన్న ఎబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ నిర్వహించే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్.కె’ కార్యక్రమానికి మంచి పాపులారిటి ఉంది. ఈ కార్యక్రమంలో ఎందరో ప్రముఖ సినిమా నటులు, రాజకీయ నాయకులు పాల్గొనడమే కాకుండా ఈ కార్యక్రమ నిర్వాహకుడు రాధాకృష్ణ వేసె లోతైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఇబ్బంది పడ్డారు. ఇటువంటి సంచలనాత్మక కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ను పిలవడానికి ఎబిఎన్ న్యూస్ ఛానల్ గట్టిగా ప్రయత్నిస్తోంది అంటూ వార్తలు వస్తున్నాయి.  ఈమధ్య పవన్ తెలుగుదేశంలోకి చేరిపోతున్నాడు అంటు ఈ చానల్ ఒక సంచలనాత్మక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. ఆతరువాత ఆ వార్తల పై నాగబాబు ఖండన చేసారు. ఈ పరిస్థుతుల నేపధ్యంలో అందునా ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ ఉద్యమాల నేపధ్యంలో పవన్ ఎబిఎన్ కెమెరాల ముందుకు వస్తాడా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. కానీ ఆ అద్భుతమే జరిగి పవన్ ఈ ఛానల్ కార్యక్రమంలో పాల్గొంటే అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమే అవుతుంది. అంతేకాదు ఎబిఎన్ ఛానల్ రేటింగ్స్ కూడ విపరీతంగా పెరిపోతాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: