బాలీవుడ్‌లో హై ఎక్స్‌పెక్టేష‌న్స్‌లో వ‌చ్చిన ఫిల్మ్ రామ్‌లీలా. ఈ మూవీ న‌వంబ‌ర్ 15న ప్రపంచ‌వ్యాప్తంగా 3500 స్ర్కీన్స్‌లో రిలీజ్ అయింది. రామ్‌లీలా మూవీ మొద‌టి మూడు రోజుల్లో వంద కోట్లను సాధించ‌డం ఖాయం అని డైరెక్టర్ సంజ‌య్‌లీలా భ‌న్సాలీ న‌మ్మకాన్ని పెట్టుకున్నాడు. కాని రామ్‌లీలా మూవీ ఇండియ‌న్ బాక్సాపీస్ వ‌ద్ద అనుకున్న స్థాయిలో క‌లెక్షన్స్‌ను కొల్లగొట్టలేక‌పోయింది. అయితే చెప్పుకోద‌గ్గ స్థాయి క‌లెక్షన్స్‌ను మాత్రం కొల్లగొట్టింది. న‌వంబ‌ర్ 15 నుండి అయిదు రోజుల క‌లెక్షన్స్ 69.2 కోట్ల కల‌క్షన్స్‌ను కొల్లగొట్టింది. ఇది ఇండియా మార్కెట్ వివ‌రాలు మాత్రమే. ఈ మూవీ మొద‌టి వారం క‌లెక్షన్స్ అన్ని క‌లుపుకొని ఇండియాలో 85 కోట్లను క‌లెక్ట్ చేస్తుంద‌ని బాక్సాపీస్ ట్రేడ్స్ చెబుతున్నాయి. ఇప్పటి వ‌ర‌కూ అయిదు రోజుల క‌లెక్షన్స్ 69.2 కోట్లు కాగా, మ‌రో రెండు రోజుల‌కు 15 కోట్ల క‌లెక్షన్స్ వ‌సూల్ చేస్తుంద‌ని బాక్సాపీస్ అంచనా వేస్తుంది. దీంతో రామ్‌లీలా మూవీ మొద‌టి వారం క‌లెక్షన్స్ ఇండియాలో 85 కోట్ల రూపాయ‌లు, ఓవ‌ర్సీస్‌లో 15 కోట్లు క‌లుపుకొని, వంద కోట్ల క‌లెక్షన్స్ కొల్లగొట్టడం ఖాయం అని బాలీవుడ్ అంటుంది. ఈ మ‌ధ్య కాలంలో దీపికా ప‌దుకొనె న‌టించిన ప్రతి చిత్రం బాలీవుడ్‌లో వంద కోట్ల క‌లెక్షన్స్‌ను ఈజీగా కొల్లగొడుతుంది. అలాగే రామ్‌లీలా మూవీ కూడ ఆ వంద కోట్ల క్లబ్‌లోకి జాయిన్ అవ్వడం ఖాయం అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: