టాలీవుడ్ బ్లాక్ బ‌స్టర్ ఫిల్మ్ ఒక్కడు మూవీను ఫైన‌ల్‌గా బాలీవుడ్‌లో రిమేక్ చేస్తున్నారు. ఒక్కడు మూవీ రైట్స్‌ను బోణిక‌పూర్ రెండు సంవత్సరాల క్రిత‌మే కొన్నాడు. ఆ మూవీను త‌న కొడుకు అర్జున్ క‌పూర్ కోసం రిమేక్ రైట్స్‌ను తీసుకున్నట్టు బిటౌన్ మీడియాకు వెల్లడించాడు. ఒక్కడు రిమేక్ మూవీను ఇప్పటికే బాలీవుడ్‌లో రిలీజ్ చేయాల్సి ఉండ‌గా ఆ ప్రాజెక్ట్‌ను ఏ విధంగా మొద‌లు పెట్టాలో అనేదానిపై బోణిక‌పూర్ కొంత క‌న్‌ఫ్యూజ‌న్‌లో ప‌డ్డాడు. అందుకే ఒక్కడు మూవీ రిమేక్‌ను ఇంకా మొద‌లు పెట్టలేదు. ప్రస్తుతానికి బోణిక‌పూర్ ఈ మూవీను రిమేక్ చేస్తున్నట్టు, దానికి సంబంధించిన షూటింగ్ జ‌న‌వ‌రి నుండి స్టార్ట్ అవుతుంద‌ని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. తెలుగు ఒక్కడు మూవీలో హీరోయిన్‌గా భూమిక చేస్తే, బాలీవుడ్‌లో మాత్రం సోనాక్షిసిన్హా న‌టిస్తుంది. ఒక్కడు రిమేక్‌లో అర్జున్ క‌పూర్ స‌ర‌స‌న సోనాక్షిసిన్హా న‌టిస్తున్నట్టుగా అఫిషియ‌ల్‌ స్టేట్‌మెంట్ కూడ అనౌన్స్ అయింది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై బాలీవుడ్‌లో టాపిక్స్ న‌డుస్తున్నాయి. బోణిక‌పూర్ ఈ రిమేక్ మూవీతో తిరిగి ఫాంలోకి రావ‌డం ఖాయం అని కొంద‌రు అంటున్నారు. ప్రస్తుతం సోనాక్షి సిన్హా అయిదు మూవీల‌లో న‌టిస్తుంది. సోనాక్షి సిన్హా న‌టిస్తున్న ఒక్కడు మూవీను అమిత్ శ‌ర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీతో అమిత్ శ‌ర్మ బాలీవుడ్ ఇండ‌స్ట్రీకు డైరెక్టర్‌గా ప‌నిచేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: