బిగ్ బి అమితాబ్ తన నటజీవితంలో అనేక ప్రయోగాలు చేసాడు. తన 45 ఏళ్ల సుదీర్ఘ సినీజీవితంలో తొలిసారిగా ఓ యానిమేటెడ్ క్యారెక్టర్‌కి డబ్బింగ్ చెప్పి మరోరికార్డు సృస్టించాడు బిగ్ బి. జయంతిలాల్ గడా నిర్మించిన 'మహాభారత్ 3 డీ' ఏనిమేషన్ చిత్రంలో భీష్మ పాత్రకు అమితాబ్ తన గాత్రాన్ని ఇచ్చాడు. అయితే, దీనికి అమితాబ్‌ను ఒప్పించడానికి ఆ నిర్మాత చాలా కష్ట పడాల్సి వచ్చిoదట.  మొదట్లో అమితాబ్ డబ్బింగ్ కు ఒప్పుకోలేక పోవడంతో, ముందుగా రెండు గంటల నిడివి గల తమ సినిమాను చూడామని అది నచ్చితేనే డబ్బింగ్ చెప్పమని కోరాడట. దీనితో అమితాబ్ అందుకు ఒప్పుకుని ఈసినిమా చూసి తనకు పూర్తి గా నచ్చడంతో ఈ డబ్బింగ్ చెప్పడానికి అమితాబ్ ఒప్పు కున్నాడని టాక్. మరో విచిత్ర విశేషం ఏమిటంటే, ఇతర ప్రధాన పాత్రలకు అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, అజయ్ దేవగణ్, సన్నీడియోల్, విద్యాబాలన్, అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖ తారలు కూడా డబ్బింగ్ చెపుతున్నారట.  నూరేళ్ళ భారతీయ సినిమాకు నివాళిగా నిర్మించిన ఈ 'మహాభారత్' త్రీడీ యానిమేటేడ్ చిత్రాన్ని అంకితం ఇస్తున్నట్లు ఈ సినిమా నిర్మాతలు చెపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: