ఒక సినిమా కంప్లీట్ కాక ముందే మరో సినిమాని చేజిక్కించుకొని కథానాయకుడు రవితేజ. జయాపజయాలతో ప్రమేయం లేకుండా తాను మాత్రం ఎక్స్ ప్రెస్ లా దూసుకెళ్లేవాడు. సినిమా సినిమాకి మధ్య రవితేజ విరామం తీసుకున్న దాఖలాలు ఈ మధ్యలో చాలా తక్కువ. అయితే బలుపు తర్వాత మాత్రం ఆయన చాలా గ్యాప్ ఇచ్చాడు. తనకు దక్కిన విజయాన్ని ఆచీతూచి అడుగులు వేస్తున్నాడు.లేదంలే కొత్త సినిమాలు ఏవీ నచ్చడం లేదో.  మొత్తానికి మాస్ రాజ కెమెరా ముందుకు వెళ్లక చాలాకాలమైంది. బలుపు రచయిత బాబి దర్శకత్వంలో తదుపరి సినిమా చేస్తున్నాడని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఆ సినిమా వైవిఎస్ చౌదరి నిర్మిస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే స్థానంలో ఇప్పడు మరో నిర్మాత వచ్చినట్లు సమాచారం. కన్నడంలో సినిమాలు తీస్తున్న రాక్ లైన్ వెంకటేష్ ఈ సినిమా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరనుంచి చిత్రం షూటింగ్ మొదలు కానుంది. బాబి గతంలో. డాన్ శ్రీను, బాడీ గార్డ్, మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రాలకు రచనా సహకారం అందించారు.తాజాగా రవితేజ-భీమినేని కాంబినేషన్లో రాబోయే సినిమా కూడా తమిళ రీమేక్ సినిమానే అని, తమిళంలో హిట్టయిన సుందర పాండ్యన్ చిత్రాన్ని తెలుగులో వీరిద్దరి కాంబినేషన్లో రీమేక్ చేస్తున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: