కొందరికి ఓ మంచి స్థాయి ఉంటుంది. సమాజపరంగా కాదు. వ్యక్తిత్వపరంగా. వాళ్ల నుంచి జనం చాలా ఎక్స్ పెక్ట్ చేస్తారు. దానికి తగ్గట్టుగా సదరు వ్యక్తులు నడచుకోవాలి. తమ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. లేదంటే అభిమానంతో పాటు గౌరవం కూడా ఆవిరైపోతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యింది ఆమిర్ ఖాన్ కి. ఆమిర్ అంటే ఓ మేధావి అన్న ఫీలింగ్ ఉంది అందరిలో. అతడి వ్యక్తిత్వం గొప్పది. సినిమాలకు కూడా విలువలు అద్దాలని ప్రయత్నిస్తుంటారు. కేవలం వినోద సాధనంగా కాకుండా సందేశాన్ని ఇచ్చే ఆయుధంగా సినిమాని మలచాలని తపన పడుతుంటాడు. ఇక సత్యమేవ జయతే కార్యక్రమంతో అయితే అందరి మనసులనూ తడిమేశాడు. అలాంటి ఆమిర్ ఎలా మాట్లాడతాడని అనుకుంటాం! మెచ్చూర్డ్ గా మాట్లాడతాడని, ప్రతి మాటా విలువైనదే అయి ఉంటుందని అనుకుంటాం. ఇంతకుముందు అతడు అలాగే మాట్లాడేవాడు కూడా. కానీ ఏమయ్యిందో ఏమో, ఈ మధ్య కాస్త శృతి మించితున్నాడు బాబు. మొన్నామధ్య ఓ ప్రోగ్రాములో పిచ్చి మాటలు మాట్లాడి కత్రినాకి చిరాకు తెప్పించాడు ఆమిర్. నిన్ను పెళ్లి చేసుకొమ్మని సల్మాన్ ని అడుగు అని అతడు అంటుంటే, సిగ్గుతో, అవమానంతో తలదించుకుంది కత్రినా. ఇది చాలా మందికి నచ్చలేదు. అలా అందరి మధ్యనా ఆడపిల్లని ఇబ్బంది పెట్టడం ఏంటని ఆమిర్ మీద చిరాకు పడ్డారంతా. తాజాగా మరో సందర్భంలో తనకెలాంటి అమ్మాయిలు నచ్చుతారు అన్నదాని మీద చిన్నపాటి లెక్చర్ ఇచ్చాడు అయ్యగారు. ఈయనకు పొడవుగా ఉండే అమ్మాయిలు నచ్చుతారట. ఆ విషయం చెప్పి, పొడవైన అమ్మాయిల మీద, హై హీల్స్ మీద తెగ మాట్లాడాడు. ఇది కత్రినాకు కోపం తెప్పించిందని సమాచారం. ఎందుకంటే ఆమె పొడవే. అతడితో కలసి నటిస్తోందొకటి. అతడు తననే అన్నట్టు ఫీలవుతుందిగా మరి! ఆమిర్ లాంటి వ్యక్తి ఇలా చీప్ వేషాలు వేయడం, చీప్ మాటలు మాట్లాడటం ఏంటో అర్థం కావడం లేదు ఎవరికీ. ఎంతో మర్యాదగా, కామ్ గా ఉండేవాడు ఇలా రెచ్చిపోయి మాట్లాడటం ఆశ్చర్యంతోపాటు కాస్త విసుగును కూడా తెప్పిస్తోంది. కాస్త కంట్రోల్ చేసుకోకపోతే ఉన్న ఇమేజ్ కాస్తా ఊడ్చుకుపోవడం ఖాయం!

మరింత సమాచారం తెలుసుకోండి: