దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు. కానీ అతిగా చక్కబెట్టుకోవాలని చూస్తే మొదటికే మోసం వస్తుంది. ఆ విషయం కాజల్ అగర్వాల్ ని చూసి అర్థం చేసుకోవచ్చు. డిమాండ్ ఉన్నప్పుడు బాగానే ఉన్న ఈ అమ్మడు, ఎప్పుడైతే డిమాండ్ తగ్గుముఖం పడుతుందని అనుమానం వచ్చిందో... అప్పుడే చక్కబెట్టుకోవడం మొదలుపెట్టింది. కానీ ఆమె ప్రయత్నాలు ఆమెకు నిరాశనే మిగిల్చాయి. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించే కాజల్ ఇప్పుడు గెస్టులాగా వచ్చి కనిపిస్తోంది. ఒకట్రెండు సినిమాలు తప్ప ఆమె చేతిలో ఉన్నవేమీ లేవు. తెలుగు సినిమాలన్నిటికీ కాదనుకుని, రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తున్నారన్న ఒకే ఒక్క కారణంతో తమిళ సీమను అంటిపెట్టుకు తిరుగుతోందామె. మనవాళ్లు అంత ఇవ్వనన్నారా, ఇవ్వడం అనవసరం అనుకున్నారో తెలియదు కానీ, ఏ సినిమాలోనూ ఆమెకి చోటు ఇవ్వడం లేదు. చాలా కాలం తరువాత కృష్ణవంశీ మల్టీ స్టారర్లో రామ్ చరణ్ సరసన నటించనుందని తెలిసి, ఇప్పటికి దెయ్యం దిగిందేమో అనుకున్నారంతా. కానీ దెయ్యం దిగడం కాదు, అసలు ఆమె ఆ సినిమాలోనే లేకుండా పోయింది. వీళ్లే తీసేశారా లేక ఆమే తప్పుకుందా అన్నది ఇంకా తెలియలేదు కానీ, చెర్రీ కోసం కేవీ కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నాడని మాత్రం తెలుస్తోంది. ఆమె కాదన్నా, మనోళ్లు వద్దన్నా కాజల్ అయితే పెద్దయ్యే ఫీలయ్యే టైపు కాదు. అందుకే తమిళంలోనే తన జెండా పాతేందుకు తన ప్రయత్నాలు తాను చేస్తోంది. త్వరలో ధనుష్ సరసన నటించబోతోందట. ఇలా రంగులు మార్చే సుందరాంగుల వెంట పడాల్సిన అవసరం టాలీవుడ్ కి ఉందంటారా? బాలీవుడ్డే గ్రేటంటూ వెళ్లిన అసిన్ ని పట్టించుకోవడం మానేయ్యలేదూ! అలాగే ఈమెను కూడా పక్కన పెట్టేస్తే ఓ పనైపోద్ది. నువ్వు కావాలి అన్నంతవరకే ఎవరైనా ఎక్కువ చేయగలరు. ఓసారి పట్టించుకోవడం మానేస్తే వాళ్లే దిగి వస్తారు. ఏమంటారు?

మరింత సమాచారం తెలుసుకోండి: