తెలుగు సినిమాలలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద సినిమాగా సూపర్ హిట్ సాధించిన ‘ఆనంద్’ సినిమా పెరువినగానే హీరో రాజా ఎవరికైనా గుర్తుకు వస్తాడు. మంచి నటుడుగానే కాకుండా డాన్సర్ గా కూడా మంచి పేరుంది. ఆనంద్ తరువాత రాజా చాల సినిమాలలో నటించినా ఏసినిమా కూడ ఆనంద్ రేంజ్ హిట్ ను రాజాకు అందివ్వలేకపోయాయి.  ప్రస్తుతం రాజా నటిస్తున్న ఒక్క సినిమా కూడ లేకపోవడంతో టాలీవుడ్ పరిశ్రమ మాత్రమే కాకుండా ప్రేక్షకులు కూడా రాజాను పూర్తిగా మరిచిపోయారు. జీసస్ ను బాగా నమ్మే రాజా క్రిస్టియానిటీ ప్రచారంలో ప్రస్తుతం రాజా చాల ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. ఆమధ్య జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరిన రాజా అక్కడ కూడా ఇమడలేక బయటకు వచ్చి తానే రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక రాజకీయ పార్టీ పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దేశంలోని క్రిస్టియన్స్ ను అందర్నీ ఒకే తాటిపైకి తీసుకు వచ్చేటట్లుగా రాజా తన పార్టీని రూప కల్పన చేస్తాడట.  రాబోతున్న ఎన్నికలలో నరేంద్ర మోడీ దూకుడుకు అడ్డు కట్ట వేసేడట్లుగా తన పార్టీ నిర్మాణం ఉంటుందని రాజా ఎత్తుగడ అట. రాష్ట్రంలో నందమూరి తారకరామారావు, చిరంజీవుల తరువాత టాలీవుడ్ లో హీరోగా నటించిన రాజా ఆ గొప్ప నటుల బాటలోనే నడుస్తూ పార్టీ పెడుతూ రికార్డుకు ఎక్కుతున్నాడు. హీరోగా పరాజయం చెందిన రాజా రాజకీయ నాయకుడిగా ఎంత వరకు సక్సస్ అవుతాడో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: