తెలుగు నాట పరిచయం అక్కరలేని వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. భారత దేశం గర్వించదగ్గ గొప్ప నటుడు, దర్శకుడు, నిర్మాతగా ఆయనను ప్రపంచమే గుర్తించింది.ఎన్.టి.ఆర్ నటనను ఆస్వాదించని ఒక్క తెలుగు వాడుంటాడా అని చెప్పడం కష్టం. తన నటనతో తెలుగు ప్రజానీకం హృదయాల్లో స్థానం సంపాదించిన గొప్ప నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్‌కు సంబంధించిన ఒక అరుదైన ఫోటోనూ మీకు అందిస్తున్నాం. అదే స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి పెళ్లి పత్రిక. ఈ పెళ్లి పత్రికని పెళ్లి కుమార్తె తండ్రి శ్రీ కాట్రగడ్డ చెంగయ్య ప్రింట్ చేయించారు. ప్రస్తుం ఈ ఫొటో అన్ని సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్స్‌లో తెగ ప్రచారం అవుతుంది. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు (1923 మే 28 - 1996 జనవరి 18) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. రామారావు, ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావు గా కూడా ప్రసిద్ధుడైన ఆయన, తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపుగా 302 చిత్రాలలో నటించాడు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన ఆయన, అనేక జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా నిలచిపోయాడు. రామారావు 1982 లో తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేసాడు. పార్టీని స్థాపించిన కేవలం 9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత మూడు దఫాలుగా దాదాపు 8 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: