జబ‌ర్ధస్త్ గేమ్ షో టాక్ ఆఫ్ ది తెలుగు పీపుల్ అయిందంటే అందులో ఎక్కువ క్రెడిట్ యాంక‌ర్ అన‌సూయ‌దే అని చెప్పాలి. ఈ షోకు అబ్బాయిలు అతుక్కుపోయారంటే.. కార‌ణం అన‌సూయ హాట్ గొప్పత‌న‌మే. కొంత హాట్ గా..మ‌రికొంత ర‌ఫ్ గా..ఇంకొంత గారంగా ఇలా.. ప‌లు విధాలుగా క‌వ్వించి..అబ్బాయిల్ని ఈ షో చూసే విధంగా ఎడిక్ట్ చేసింది. అయితే ఈ షో మంచి స్వింగ్ లో ఉన్నప్పుడే అన‌సూయ ఏవో కార‌ణాలతో త‌ప్పుకుంది. క‌ట్ చేస్తే. ప‌వ‌ర్ స్టార్ సినిమా అత్తారింటికి దారేది చిత్రంలో ఒక సాంగ్ లో క‌నిపించే ఆఫర్ వ‌చ్చింది. అయితే గుంపులో గోవింద‌లా క‌నిపించ‌డం ఇష్టం లేని అన‌సూయ , ప‌వ‌న్ సినిమా ఆఫ‌ర్ ను రిజెక్ట్ చేసింది. అయితే దీనిపై క్రిటిక్స్ మాత్రం అన‌సూయ చాలా మిస్ అయ్యింది. కెరీర్ ప‌రంగా చాలా కోల్పోయింది అన్నారు. అవేమి ప‌ట్టించుకోని అన‌సూయ, తాజాగా చిన్ని చిన్ని ఆశ అనే ఒక చిత్రంలో న‌టించింది. ఆ సినిమాకు పెద్ద ప్రచారం లేక‌పోవ‌డంతో ఎప్పుడు వ‌చ్చి వెళ్లిందో కూడా తెలియ‌దు. త‌న ఉద్దేశ్యం మంచి పాత్రలు చేయాల‌ని త‌ప్ప, జ‌స్ట్ ఇలా క‌నిపించి అలా వెళ్లి పోవ‌డం కాద‌నే విష‌యం స్పష్టం చేసింది. ఇక గ‌త వారం ఈ హాట్ యాంక‌ర్ రెండో బిడ్డకు జ‌న్మనిచ్చింది. ఇక పిల్లవాడు పెద్దయితే, అన‌సూయ మ‌ళ్లీ యాంక‌ర్ గా బిజీ కావ‌డం ఖాయం అని అంటున్నారు.అన‌సూయ యాంక‌రింగ్‌ను చూడాల‌ని పాపం అంద‌రూ ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: