బెజవాడ రౌడీ... ఈ సినిమా పేరు వినగానే వర్మ గుర్తొస్తాడు. అతడి చేతిలో పడి ఓ ఘోరమైన అట్టర్ ఫ్లాపును మూటగట్టుకున్న నాగచైతన్య కూడా గుర్తుకొస్తాడు. రంగా జీవితం చుట్టూ అల్లుకున్న కథతో ఏదో చేసేద్దామనుకున్న వర్మ, చైతూ కెరీన్ ని ఏదో చేసేశాడు. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి కుర్రాడికి చేతకూడా కాలేదు పాపం. అయితే ఇప్పుడు మరోసారి బెజవాడ వెళ్తున్నాడు నాగచైతన్య. ఈసారి వర్మ కాదు, దేవ కట్ట తీసుకెళ్తున్నాడు. విషయమేమిటంటే... ఆటో నగర్ సూర్య సినిమా బెజవాడ బ్యాగ్రౌండ్ లో జరుగుతుందట. అక్కడ రౌడీయిజం ఎలా ఉంది, రాజకీయ నాయకుల కుతంత్రాలు ఎలా ఉంటాయి వంటి అంశాలతో తీశారట. ఈ కథకీ చైతూకీ లింకేంటి అన్నది ఆసక్తికరంగా ఉంటుంది అంటున్నాడు దర్శకుడు. ఆల్రెడీ ఈ సినిమాలోకి కొన్ని డైలాగులు లీకయ్యాయి. పవర్ ఫుల్ గా అనిపించిన ఆ మాటలు వింటేనే, కచ్చితంగా సినిమాలో ఏదో సీరియస్ అంశం ఉందనే అనుమానం వచ్చింది. ఇప్పుడు దేవా కట్ట ఇలా అనేసరికి అందరి అనుమానం నిజమేనని అర్థమయ్యింది. కావాలని దర్శకుడు ఈ సినిమా కోసం ప్రత్యేకమైన డైలాగులు రాశాడట. కొన్ని సంభాషణల్లో విజయవాడలోని కొందరు పెద్ద తలకాయల పేర్లు కూడా వినిపిస్తాయని సమాచారం. అతడు తీస్తే తీశాడు. అతడి గురించి మనకు ఏ టెన్షనూ లేదు. టెన్షనంతా చైతూ గురించే. రకరకాల ప్రయోగాలు చేసి చిత్తయిపోవడం అబ్బాయికి బాగా అలవాటైపోయింది. దడలో పెద్ద పెద్ద గ్యాంగ్ స్టర్లతో పోటీపడే పాత్రను పండించలేకపోయాడు. బెజవాడ చిత్రంలో దందాలు చేసే నాయకుడిలా ఏమాత్రం సూట్ కాలేకపోయాడు. అలాంటివాడు మళ్లీ ఇలా రాజకీయాలు, పగలు, ప్రతీకారాలు అంటున్నాడంటే ఏం జరుగుతుందోనని భయం. ఇన్ని దెబ్బలు తిన్న చైతూకే భయం లేనప్పుడు మనకెందుకు... ధైర్యంగా చూద్దాం, సినిమా ఎలా ఉంటుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: