స్వీటీ లిప్స్ తాప్సీ ఎవ‌రి మాట విన‌నంటుంది. ఎంద మంది ఎన్ని ర‌కాలుగా చెప్పినా త‌ను అనుకున్నదే చేస్తాను అంటూ మొండి ప‌ట్టుద‌ల‌తో ముందుకు వెళుతుంది. తాస్పీ ఎందుకు ఇలా చేస్తుందో ఎవ‌రికి అర్ధం కావ‌డంలేదు. మేట‌ర్‌లోకి వెళితే తాప్సీ లేటెస్ట్‌గా ఏ మాత్రం స్టార్‌డం లేని హీరోతో న‌టించేందుకు సిద్ధప‌డింద‌ట‌. తాప్సీ ఇలా మారిపోవ‌డానికి చాలానే కార‌ణాలు ఉన్నాయి. మొద‌టి సినిమా ఝ‌మ్మంది నాధం త‌రువాత సెలిక్టివ్‌గా సినిమాలు చేయ‌కపోవ‌డంతో, తాప్సీ సీన్ రివ‌ర్స్ అయ్యింది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శ‌ని చందంగా త‌య్యారైంది. పుల్ సెక్సీగా క‌నిపిస్తూ ఎంత యాక్టింగ్ చేసినా తాప్సీకు లాభం లేక‌పోయింది. తెలుగు నేర్చుకుని త‌న రోల్స్ కు త‌నే డ‌బ్బింగ్ కూడ‌ చెప్పుకుంది. ఇలా చాలా పాజిటివ్ పాయింట్స్ వున్నా, ఫెయిల్యూర్స్ ఎక్కువ వుండ‌టంతో కెరీర్ బండి గూడ్స్‌లా వెళ్తుంది. ఈ యేడాది సాహ‌సం సినిమా తెలుగులో పాజిటివ్ టాక్ తెచ్చుకోక‌పోయి వుంటే.. తెలుగు ద‌ర్శక నిర్మాత‌లు తాప్సీ ని పూర్తిగా మ‌ర‌చిపోయే వాళ్లు ప‌రిస్థితి వ‌చ్చింది. మొత్తం మీద తాప్సీ ఇప్పటికి త‌నకు రోల్ న‌చ్చితే, అనామ‌కుడితో అయినా యాక్ట్ చేస్తానంటోంది. ఇదే పాలో అయితే, ఏదో ఒక స‌మ‌యంలో టాలీవుడ్‌కి పేక‌ప్ చెప్పి, తాప్సీ ఢిల్లి ఫ్లైట్ ఎక్కడ‌మే అని అంటున్నారు. ఇక ఈ మ‌ధ్య త‌మిళ్‌ అజిత్ చిత్రం ఆరంభంలో న‌టించింది.ఈ సినిమా సూప‌ర్ హిట్ దిశ‌గా దూసుకుపోతుంది. ఇక లారెన్స్‌తో మునీ 3 చిత్రం చేస్తుంది. తెలుగులో మాత్రం ప్రస్తుతానికి ఆఫ‌ర్స్ ఏమి లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: