వివాదాలకు చిరునామాగా ఉండే రామ్ గోపాల్ వర్మజీవన విధానం పై మరో సెటైర్లు విసిరే సినిమా రాబోతోంది. ‘శ్యాం గోపాల్ వర్మ' టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈచిత్రానికి ‘నా సినిమా నా ఇష్టం' అనేది సబ్ టైటిల్. రాకేష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు షఫి ఈచిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈసినిమాలో షఫి వర్మను పోలిన దర్శకుడిగా కనిపిస్తాడు. జోయా ఖాన్ హీరోయిన్ గా చేస్తోంది. సమిష్టి క్రియేషన్స్ బేనర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని విజయ్ కుమార్ రాజు, రాకేష్ శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాహుల్ శ్రీ వాత్సవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.  ఈ సినిమా ప్రారంబోత్సవం నిన్న హైదరాబాద్ లో జరిగింది. ‘రక్తపాత సినిమాలు తీయడం అతని నైజం, దాని ఫలితం ఇప్పుడు అనుభవించక తప్పదు’ అంటూ సినిమా పోస్టర్లపై కొటేషన్లు పెట్టడాన్ని బట్టి ఈ సినిమా ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మను టార్గెట్ చేస్తూ తీస్తున్న సినిమాగానే ఎవరకైనా అనిపిస్తుంది. కానీ ఈసినిమా దర్శకుడు మాత్రం ఈ సినిమాను తాను ఎవరి జీవితాలను టార్గెట్ చేసే విధంగా తీయడంలేదని ఇది పూర్తిగా తన సొంత ఆలోచన అని అంటున్నాడు.ఈ సినిమాలో హీరో ఒక దర్శకుడిగా మారి రక్తపాతం, హింసాత్మక సినిమాలను నిర్మించి చివరకు ఆసినిమాల వల్ల ఎలా అన్ పాపులర్ అయ్యాడు అనే విషయాలు ఉంటాయి అని అంటున్నాడు.  రాంగోపాల్ వర్మ పై ఎవరు ఎన్ని సెటైర్లు వేసినా తెలుగులో ఆయన తీసిన ‘శివ’ సినిమా టాలీవుడ్ దర్శకుల ఆలోచనలను మార్చింది అనేది నిజం. మరి ఈ కొత్త దర్శకుడు వర్మ పై వేస్తున్న సెటైర్లకు వర్మ ఏమంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: