నేడు మన దేశంలో సోషల్ నెట్వర్కింగు వెబ్ సైట్లు రాజ్యమేలుతున్న రోజులు ఇవి. ప్రజల భావాలను ఆలోచనలను ఇవి బాగా ప్రభావితం చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఇంటర్నెట్ ప్రపంచం అరచేతిలోకి వచ్చింది. యువతరం ఎప్పుడూ ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి వెబ్ సైట్లకు అంటిపెట్టుకునే ఉంటున్నారు. ఈ ట్రెండుకు తగిన విధంగా పలువురు సినిమా స్టార్లు రాజకీయ నాయకులు కూడా ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు.  ఆఖరికి త్వరలో రాబోతున్న ఎన్నికలలో కూడా ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ప్రధాన పాత్ర వహిస్తాయి అని అంటున్నారు. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో స్థాయితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సోషల్ నెట్వర్కింగ్ అకౌంట్స్ ఓపెన్ చేసి తమకు ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితి ఎంత విచిత్రం గా తయారైంది అంటే టాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా సోషల్ నెట్వర్కింగులో ఎంత ఎక్కువ మంది ఫాలోయర్స్ ఉంటే అంత గొప్ప అనే రీతిలో నేటి కల్చర్ ఉంది.ఈ పరిస్థితుల నేపధ్యంలో కొందరు ఇతర ప్రయోజనాల నిమిత్తం కొందరు స్టార్స్ పేరుతో ఫేస్ బుక్ పేజీలు క్రియేట్ చేస్తున్నారు. అది నిజంగా సదరు స్టార్ల అఫీషియల్ పేజీయే అనే విధంగా అభిమానులను నమ్మిస్తున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరుతో కూడా ఇలాంటి ఫేక్ పేజీలు ఫేస్ బుక్, ట్విట్టర్ లు కనిపిస్తున్నాయి.  అయితే పవన్ కళ్యాణ్ పేరుతో ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ పేజీలు లేవని, వాటిలో పవన్ కళ్యాణ్ గురించి వచ్చే స్టేట్ మెంట్లు నమ్మొద్దని అంటున్నారు పవన్ సన్నిహితులు. పవన్ పేరుతో సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఎటువంటి ఆఫీసియల్ పేజీలు లేకుండా ఉంటేనే ఇంత ఫాలోయింగ్ వస్తూ ఉంటే ఇక నిజంగా అఫీషియల్ ఫేస్ బుక్ ట్విటర్ ఏర్పడితే కోటాను కోట్లమంది ఫాలోయర్స్ తో సోషల్ నెట్ వర్కింగ్ రికార్డులను క్రియేట్ చేయడం ఖాయం అని అంటున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: