సన్నగా, మెరుపు తీగలా ఉండే ఇలియానాని మొదటిసారి దేవదాసులో చూసినప్పుడే ఫ్లాటైపోయారంతా. కన్ను మూసి తెరిచేలోగా ఆమె తెలుగు ప్రేక్షకులకు కలల రాణి అయిపోయింది. అయితే బాలీవుడ్ మీద పిచ్చితో మన సినిమాలను కాదనుకుని వెళ్లిపోయింది ఇలూ. మొదట్లో తడబడింది కానీ ఇప్పుడు అవకాశాలు బాగానే వస్తున్నాయి. బర్ఫీ సినిమా చూసినప్పుడే ఇలూ నటనకు ఫిదా అయిపోయారు బాలీవుడ్ వారు. అయితే అవకాశాల వేగం పెరగడానికి కాస్త టైమ్ పట్టింది. ప్రస్తుతం డేవిడ్ ధావన్ కొడుకు వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తోంది గోవా బ్యూటీ. ఈ సినిమా మన కందిరీగ చిత్రానికి హిందీ రీమేక్. ఇందులో హన్సిక చేసిన పాత్రలో నటిస్తోంది ఇలియానా. అయితే ఆ సినిమాకి పని చేసీ చేసీ ఒళ్లు హూనమైపోతోందట మన స్లిమ్ సుందరికి. ఎందుకంటే... ఈ సినిమాలో పాటలన్నటికీ డ్యాన్స్ ఉందట. ఓ పాటలో అయితే చాలా కష్టమైన స్టెప్స్ ఉన్నాయట. అవి చేయలేక వరుణ్ తో పాటు తాను కూడా ముప్పుతిప్పలు పడుతున్నానని చెబుతోంది ఇలియానా. నా జీవితంలో నేనెప్పుడూ ఇంత కష్టమైన స్టెప్స్ వేయలేదు, ఒళ్లు హూనమైపోతోంది అంటోంది నవ్వుతూ. ఇలియానా మంచి డ్యాన్సరే. అయితే మరీ అంత గొప్ప డ్యాన్సరేమీ కాదు. అందుకే అంత కష్టంగా ఉందేమో. ఏదేమైనా, ఇది పక్కా కమర్షియల్ సినిమా కావడంతో తన కెరీర్ కి ప్లస్ అవుతుందని ఆనందపడుతోంది లూ. ఏక్తా కపూర్ నిర్మాత కావడంతో బోలెడంత ఖర్చు పెట్టి తీస్తోంది. ఇది కనుక సక్సెస్ అయితే ఇలియానా పంట పండినట్టే!

మరింత సమాచారం తెలుసుకోండి: