షారన్ స్టోన్... ఈ పేరు వింటే పురుషుల గొంతు తడారిపోతుంది. హాట్ యాక్ట్రెస్ లు చాలామంది ఉంటారు. కానీ షారన్ తీరే వేరు. హాలీవుడ్లో ఈమె ఒక సంచలనం. ప్రపంచమంతా కూడా మారుమోగిపోయిన ఘనత ఆమె సొంతం. మన టాలీవుడ్లో కూడా కొందరు హీరోలు ఈమెకి పిచ్చ ఫ్యాన్స్. బేసిక్ ఇన్ స్టింక్ట్ సినిమాని చూసిన వాళ్లెవరూ షారన్ ని మర్చిపోరు. అమాయకంగా నటించే హంతకురాలిగా ఆమె నటన అమోఘం. శృంగారాన్ని ఒలికించడంలో, తెర మీద చూపించడంలో ఓ ట్రెండునే క్రియేట్ చేసింది షారన్. అలాంటి నటిని ఇండియాకి రప్పించింది ఓ సంస్థ. ఐశ్వర్యారాయ్ తో కలసి కొన్ని రకాల సేవా కార్యక్రమాలు చేసేందుకు నడుం కట్టింది షారన్. ఓ ఎన్టీవో తరఫున ఈ అందాల తారలిద్దరూ కలిసి పని చేయనున్నారు. దీని కోసం ఇటీవలే ఇండియాకి వచ్చింది షారన్. ఆ సందర్భంగా ఆమె తాజ్ మహల్ ని సందర్శించింది. ఆ నిర్మాణం వెనుక ఉన్న కథను విని ఇంప్రెస్ అయిపోయింది. ఎమోషనల్ అయ్య కన్నీళ్లు కూడా పెట్టేసుకుంది. తాజ్ మహల్ గురించి విన్నప్పట్నుంచీ దాన్ని చూడాలని ఎంతో ఆశపడిందట షారన్. ఇప్పుడా చాన్స్ రావడంతో వెంటనే అక్కడ ప్రత్యక్షమైపోయింది. ఆమె తాజ్ మహల్ గురించి, దాని వెనుక ఉన్న కథ గురించి వివరించాడు గైడ్. అంతే... షాజహాన్ ప్రేమ గురించి వినగానే ఎమోషనల్ అయిపోయింది షారన్. ఇలాంటి ప్రేమికులు కూడా ఉంటారా అంటూ ఏడ్చేసింది. మొదట అందరూ కంగారుపడ్డారట. తర్వాత కారణం తెలిసి సైలెంటయ్యారట. అలా మన షాజహాన్ గారి ప్రేమ కథ హాలీవుడ్ నటితో కన్నీళ్లు పెట్టించిందన్నమాట!

మరింత సమాచారం తెలుసుకోండి: