ఈ హెడ్ లైన్ చాలామందిని కంగారు పెట్టేస్తుందని తెలుసు. ఎందుకంటే, సన్నీ లియోన్ కి అభిమానులు తక్కువేమీ లేరు. ఎక్కడి నుంచో వచ్చి, ఇక్కడి వారిని పడగొట్టేసింది. పోర్న్ స్టార్ అయివుండీ, బాలీవుడ్లో హీరోయిన్ గా పాగా వేసేసింది. అతి తక్కువ టైములో ఊహించనంత పాపులారిటీని సంపాదించేసింది. అలాంటి సన్నీ ఉన్నట్టుండి కెనడా ఎందుకు వెళ్లిపోతోంది! వెళ్లక తప్పని పరిస్థితి సన్నీది. ఆమె కెనడాలో చాలా ఫేమస్ పోర్న్ స్టార్. చాలా నీలి చిత్రాలు చేసింది. అలాంటి చిత్రాలు చేసే కంపెనీలు కొన్నే ఉంటాయి. వాటిలోని ఓ కంపెనీతో సన్నీకి అప్పట్లో కాంట్రాక్ట్ కుదిరింది. వారి చిత్రాలన్నింటిలో నటించింది. అయితే నీలి చిత్రాలు తీసే కంపెనీలకు ఓ రూల్ ఉంది. అదేంటంటే... ప్రతి నటీ ఎయిడ్స్ పరీక్షలు చేయించుకోవాలి. చిత్రాలు చేసేముందే కాదు, ఆ తరువాత కూడా ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలి. ఆ పరీక్షల కోసమే సన్నీ కెనడా వెళ్తోంది. అదేంటి, ఆమె బ్లూ ఫిల్ములు చేయడం మానేసిందిగా అనేగా సందేహం. ఆమె నిజంగానే మానేసింది. సాధారణ నటిగా పేరు తెచ్చుకోవాలని తహతహలాడుతోంది. కానీ ఎయిడ్స్ పరీక్షలు ఒక్కసారి చేస్తే సరిపోదు. కొన్నేళ్ల పాటు చేయించుకోవాలి. గ్యాప్ తీసుకుంటూ కొన్ని నెలలకోసారి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఆమె ఏమో ఇక్కడ సినిమాల్లో బిజీ అయిపోయి వాటిని చేయించుకోవడానికి వెళ్లడం లేదట. దాంతో అక్కడి కంపెనీవారు రమ్మని కబురు చేశారట. అయితే వెళ్లి వెంటనే రాలేదట సన్నీ. కొన్ని నెలల పాటు అక్కడే ఉండాల్సి వస్తుందట. ఈ విషయం తెలిసి చాలామంది చాలా రకాలుగా వార్తలు రాశారు అని సన్నీ ఫీలవుతోంది. నేను మామూలుగా అయిపోవాలని, అందరిలోనూ కలసిపోవాలని అనుకుంటున్నాను, కానీ నన్నింకా వేరుగానే చూస్తున్నారు అంటూ బాధపడుతోంది సన్నీ. నేను నీలి చిత్రాలు చేసిన విషయం దాచిపెట్టలేదు, ఆ సినిమాలు చేసినవాళ్లకు ఇలాంటి పరీక్షలు తప్పవు, మామూలువాళ్లు కూడా ఈ పరీక్షలు చేయించుకుంటారు కదా, నా గురించి ఎందుకు పెద్ద ఇష్యూ చేస్తారు అంటూ ఆవేదన చెందుతోంది సన్నీ. అదీ నిజమే కదా. ఎవరో ఎప్పుడో ఏదో చేశారని జీవితాంతం వారినలాగే చూడటం ఎంతవరకూ కరెక్ట్!

మరింత సమాచారం తెలుసుకోండి: