నవంబర్ నెల మంచువారి కుటుంబానికి బాగా కలిసివచ్చిన నెల గా రికార్డులు క్రియేట్ చేస్తోంది. మంచు విష్ణు తన 32వ పుట్టినరోజును నిన్న తన కవల పిల్లలతో ఆనందంగా జరుపుకుంటే ఇదే నెలలో మోహన్ బాబు కూడా తన 38వ టాలీవుడ్ ఎంట్రీ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాడు.  మోహన్ బాబు నటించిన మొట్టమొదటి సినిమా ‘స్వర్గం నరకం’ నవంబర్ 22న విడుదలైంది. అప్పటి నుంచి విలన్ గా, హీరోగా, నిర్మాతగా మారిన మోహన్ బాబు ఇప్పటి వరకు 550 సినిమాలలో నటించి టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. గత పది సంవత్సరాలుగా హీరోగా నటిస్తున్న విష్ణు గత సంవత్సరం విడుదలైన ‘దేనికైనా రెడీ’ సినిమాతో మళ్ళీ లైమ్ లైట్ లోకి రావడమే కాకుండా తన స్పీడ్ ను పెంచి త్వరలో రామ్ గోపాల్ వర్మా, పూరి జగన్నాద్ సినిమాలలో నటించబోతున్నాడు.  ఇవన్నే ఒక ఎత్తయితే త్వరలో రాబోతున్న మంచు వారి కుటుంబ కధా చిత్రం ‘పాండవులు పాండవులు తుమ్మెదా’ ఈ తండ్రీ కొడుకుల కెరియర్ ను ఎటువంటి మలుపు తిప్పుతుందో చూడాలి. నటుడిగా కొనసాగుతూ 58 సినిమాలను నిర్మించిన రికార్డు మోహన్ బాబు సొంతం అయితే తన తండ్రికి తనేమి తగ్గను అన్నట్లు విష్ణు కూడా హీరోగా కొనసాగుతూ సినిమాలు తీస్తున్నాడు. తన తండ్రి వారసత్వాన్ని విష్ణు మరింత కొనసాగించాలని కోరుకుందాం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: