‘అత్తారిల్లు’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో టాలీవుడ్ టాలీవుడ్ ఎంపరర్ గా మారిపోయిన పవన్ కళ్యాణ్ క్రేజ్ ను తమ మల్టీ నేషనల్ కంపెనీ ప్రొడక్ట్స్ కు వాడుకుని తమ ప్రొడక్ట్స్ అమ్మకాలను పెంచు కుందామని పవన్ ఇంటి ముందు క్యూ కడుతున్నా బ్రాండ్ ఎండార్స్ మెంట్ ఆఫర్స్ కు పవన్ స్పందన పెద్దపెద్ద కంపెనీలకు సైతం పెద్ద షాక్ గా మారుతోందట.  లిక్కర్ అమ్మకాలలో రారాజు గా వెలుగొందుతున్న ఒక ప్రముఖ కంపెనీ తమ అమ్మకాలు పెంచుకోవడానికి ఇంత వరకూ ఏ టాలీవుడ్ హీరోకి ఇవ్వని భారీ మొత్తాన్ని పవన్ కు ఆఫర్ చేస్తే ఇప్పటికే రాష్ట్రంలోని యువత తప్ప తాగి చెడిపోతున్నారని తన పేరు చెప్పుకుని ఇంకా లిక్కర్ అమ్మకాలు పెంచు కుంటారా అని అడగడంతో ఆ కంపెనీ వారు ఏమి చెప్పాలో తెలియక ఆ కంపెనీ యాడ్ కు తమిళ్ టాప్ స్టార్ అజిత్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకున్నట్లు గా వార్తలు వస్తున్నాయి.  ఇప్పటి వరకు ఎన్టీఆర్ ను బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకున్న ఒక ప్రముఖ జ్యూలరీ సంస్థ పవన్ ను తమ నగల షోరూంలకు ప్రచారకర్త గా వ్యవహరించమని అడిగేతే ఆసంస్థ తరఫున తాను చెప్పే మాటలకు గ్యారంటీ ఉందా?అని పవన్ అడిగిన ప్రశ్నలకు షాక్ కు గురిఅయిన ఆ జ్యూయలరి సంస్థ వారు తిరిగి తమ బ్రాండ్ కు జూనియర్ నే బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒక పెద్ద కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా అవకాసం వస్తే చాలు కోట్లాది రూపాయలు ఆదాయం వస్తుంది అని నేటి టాప్ హీరోలు ఆలోచిస్తున్న ప్రస్తుత రోజులలో మల్టీ నేషనల్ కంపెనీలకే చుక్కలు చూపెడుతున్న హీరోగా మరో రికార్డును క్రియేట్ చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: