మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్సకత్వంలో రూపొందుతున్న ‘1’ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి అయిపోయింది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పతాక సన్నివేశాలు రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించారు. ఇక ఈ సినిమాకు మిగిలిపోయిన ఒకేఒక పాట బేలెన్స్ ను కూడా ఈనెల 28 తారీఖు నుండి ముంబాయిలో చిత్రీకరించి ఈ సినిమా షూటింగ్ ముగిస్తారట.  అయితే ఈ సినిమాకు ఏ దర్శకుడు చేయని సాహసం దర్శకుడు సుకుమార్ చేస్తున్నాడు అంటు ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ లేకుండా భారీ చేజ్ లు, రిచ్ లోకేషన్స్ లో యాక్షన్ థ్రిల్లర్ గా ఈసినిమాను రూపొందించడంతో ఈ సినిమా నిర్మాతలకు దాదాపు 70 కోట్ల దాకా ఖర్చు అయింది అని అంటున్నారు. ప్రస్తుత పరిస్థుతులలో 40 కోట్ల సినిమా అంటేనే టాలీవుడ్ లో నిదోక్కుకోవడం కష్టం గా ఉంది. అన్ని సినిమాలు ‘అత్తారింటికి దారేది’ సినిమాలు లా బ్లాక్ బస్టర్ కావు.  ఈ పరిస్థుతులలో ఈ సినిమా కొనుక్కున్న బయ్యర్లు అలాగే ఈసినిమా నిర్మాతలు సేఫ్ గా బయటకు రావాలి అంటే సంక్రాంతి ముందు విడుదల అవుతున్న ఈసినిమా మూడు వారాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ప్రతిధియేటర్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆడితే కాని మహేష్ ‘1’ సినిమా గట్టేక్కదని అలా జరగకుంటే దర్శకుడు సుకుమార్ కన్నా మహేష్ కు టాలీవుడ్ లో నెగిటివ్ పబ్లిసిటీ వస్తుందని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా రాబోతున్న సంక్రాంతి మహేష్ కు పరీక్షా కాలమే అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: