తెలుగు తెర జక్కన్నగా పిలిపించుకునే రాజమౌళి తాను దర్శకత్వం వహించే సినిమాల సన్నివేశాల విషయంలో ఎక్కడా రాజీ పడడు. అందుకే ఆయనను మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని అంటారు. 100 కోట్ల సినిమాగా తెలుగు తమిళ భాషలలో తెరకెక్కుతున్న ‘బాహుబలి’ సినిమాకు సంబంధించి ఒక సన్నివేసం చిత్రీకరణకు తనకు 60రోజులు పడుతుందనీ ఆ సినిమా నిర్మాతలకు అలాగే ఆసినిమాలో నటిస్తున్న ముఖ్య నటీనటులు ప్రభాస్, రానా, అనుష్క లకు ముందుగానే మానసికంగా ప్రిపేర్ చేస్తున్నాడట రాజమౌళి.  దాదాపు 2000 వేల మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ సినిమాలోని ప్రధాన పాత్రలతో పాల్గొనే ఈ సన్నివేసం ఈ సినిమాకు క్లైమాక్స్ సన్నివేశం కాదు. కానీ కధకు సంబంధించి ఒక ముఖ్య సన్నివేసం కావడంతో ఈ ఒక్క సీన్ ను రెండు నెలలు చిత్రీకరిస్తాడట మన జక్కన్న. ‘బాహుబలి’ సినిమాకు సంబంధించి ఒక ముఖ్య పోరాట సన్నివేసంగా ఉండే ఈ సీన్ లో రెండు వేల మంది పోరాట యోధులు రకరకాల ఆయుధాలతో, గుర్రాలతో యుద్ధం చేసే ఈ సన్నివేసంలో పాల్గొనే అందరికీ ఇప్పటికే వియత్నాం నుంచి వచ్చిన ట్రైనర్స్ రిహార్సల్స్ ఇస్తున్నారట.  యాక్షన్ సినిమా ఫోటో గ్రాఫర్ పీటర్ హెయిన్ దర్శకత్వంలో అనేకమంది విఎఫెక్స్ టీమ్ ఈ సన్నివేశ చిత్రీకరణకు సంబంధించి చేయవలసిన ఏర్పాట్లు గురించి అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది. ఈ సన్నివేశo చిత్రీకరణ వచ్చే నెల డిసెంబర్ లో మొదలై జనవరి నెలాఖరు వరకు నడుస్తుందట. అందుకే కాబోలు ‘బాహుబలి’ విడుదల 2015 లో మాత్రమే అని అంటున్నాడు రాజమౌళి. 

మరింత సమాచారం తెలుసుకోండి: