అనుష్క, ఆర్య నటించిన సెల్వ రాఘవన్ డ్రీం మూవీ ‘వర్ణ’, పోయిన శుక్రవారం విడుదల అయిన విషయం అందరికి తెలిసిందే. విమర్శకుల నుండి ఈ చిత్రానికి చాల తక్కువ రేటింగ్స్ వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 65 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా కనీసం 20 కోట్లైన తిరిగి రాబడుతుందో లేదో అనేది ట్రేడ్ వర్గాల అనుమానం.ఆంధ్ర ప్రదేశ్ తో సహా జార్జియా, రియో డే జేనరియో, బ్రెజిల్ లోని అందమైన లొకేషన్స్ లో సినిమాని చిత్రీకరించారు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ అనుష్క తన స్పందన తెలియచేసారు.’సినిమా విడుదలై వారం కూడా కాకముందే జయాపజయాలపై మాట్లాడటం సరికాదు. చాలా కష్టపడి నిర్మించారు. కధ విన్నప్పుడు చాల ఎక్సైట్ అయ్యాను. సెల్వ రాఘవన్ తో సినిమా అంటే ఎవరు కాదంటారు.ఇలాంటి మంచి సినిమాలో భాగం అయినందుకు చాల సంతోషంగా ఉంది. ఇలాంటి అద్భుతమైన సినిమాని అంత త్వరగా అంచనా వేయలేం.’ అందరు అదే ఊహించుకొని వెళ్లారు జేజమ్మ, సెల్వ రాఘవ మంచి సినిమానే తీసుంటాడు అని. కానీ చూసిన ప్రేక్షకులకు మాత్రం సినిమాలో ఏముందో అర్ధం అవ్వటం లేదు. బహుశ సినిమా చివర్లో అయినా మీరేం చెప్పదలుచు కున్నారో చెప్పుంటే, జనాలకు కూడా ఎంత గొప్ప సినిమా అనేది అర్ధం అయుండేది. మా కళ్ళ తో చూడండి, సినిమా గొప్పతనం తెలుస్తుంది అంటే, మాకు రెమ్యునరేషన్ ఇవ్వండి అంటారేమో జాగ్రత్త!! 

మరింత సమాచారం తెలుసుకోండి: