మామూలుగా ఎవరైనా కొన్నిఫెయిల్యూర్స్ రాగానే డిజప్పాయింట్ అవుతారు. కానీ ప్రియమణి మాత్రం అలా అవ్వదు. ఏ అవకాశం వస్తుందా, మళ్లీ తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుందామా అని ఆశగా ఎదురు చూస్తూనే ఉంటుంది. మార్కెట్ ఎప్పుడో పడిపోయినా వచ్చని ప్రతి సినిమానీ చేసుకుంటూ పోతోంది. కానీ పాపం అదృష్టమే ఆమెతో ఆడుకుంటోంది. జాతీయ అవార్డు అందుకున్న నటి ప్రియమణి. అయినా కెరీర్ ఏమీ పెద్ద ఆశాజనకంగా లేదామెకి. చండి సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ అది కాస్తా తీవ్రమైన నిరాశను కలిగించింది. ఆ తరువాత సైలెంట్ అయిపోయింది ప్రియమణి. కొద్ది రోజులుగా ఆమె ఊసే వినిపించకుండా పోయింది. కానీ ఇప్పుడు మళ్లీ బయటకు వచ్చింది ప్రియమణి. కొన్ని నెలల తరువాత ట్విటర్ అకౌంట్లో మెసేజులు పెట్టింది. పత్రికలతో కబుర్లు చెప్పింది. ఆ సందర్భంగా ఇచ్చినదే పై స్టేట్మెంట్. తననెవరూ గుర్తించలేదు అని ఆమె అంటే... నటిగా అనుకునేరు. ఆమె చెబుతోంది రియల్ లైఫ్ లో తననెవరూ గుర్తించలేరు అని. ఆమెకు మేకప్ అంటే పెద్దగా ఇష్టం ఉండదట. సినిమాల్లో తప్ప బయట అస్సలు మేకప్పే పూసుకోదట. ప్రత్యేకంగా కూడా తయారవదట. అందుకే తనను బయట ఎవరూ గుర్తే పట్టరట.   తన కెరీర్ గురించి కూడా చాలా విషయాలు చెప్పింది. ఫ్లాపులు వచ్చినందుకు, చాలా తక్కువ సినిమాలే చేసినందుకు ఆమెకేమీ బాధగా లేదట. చేసినవాటిలో కొన్ని మంచి సినిమాలు ఉన్నాయి, కొన్ని అవార్డులు కూడా తెచ్చిపెట్టాయి, నేను మంచి నటినని అందరూ గుర్తించారు, ఎంతోమంది నన్ను అభిమానిస్తున్నారు, అది చాలు నాకు అంటోంది. ఈ మాత్రం పాజిటివ్ గా ఆలోచించడం ఎంతో అవసరం. అలా ఆలోచించబట్టే ఎన్ని దెబ్బలు తగిలినా ప్రియమణి ఇప్పటికీ కాన్ఫిడెంట్ గా అడుగులు వేయగలుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: