మొన్నటి వరకూ అవకాశాలే లేవు. ఒక్కసారిగా అదృష్టం వెతుక్కుంటూ వచ్చి తలుపు తట్టింది. సమయానికి తలుపు తీయడం వల్ల ఆమె ఇంట్లోనే తిష్ట వేసుక్కూచుంది. దానికి ఆనందపడాల్సింది పోయి అతి జాగ్రత్త పడిపోతోంది ప్రణీత. ఆమె అప్పుడే కండిషన్లు పెట్టడం చూసి అందరూ కాస్త షాక్ కూడా తింటున్నారు. అత్తారింటికి దారేది సినిమా ప్రణీత కెరీర్ ను ఎలా మలుపు తిప్పిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమాలో సమంత కంటే ఆమే ఎక్కువ అట్రాక్ట్ చేసేసరికి దర్శకుల కళ్లు కూడా ఆమె మీదే పడ్డాయి. ఆమెను తీసుకునేందుకు పలువురు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ప్రణీత మాత్రం అందరికీ అవకాశం ఇవ్వడం లేదు. ఇటీవల ఓ దర్శకుడు ప్రణీతకు కథ చెప్పడానికి వెళ్లాడట. ఆ కథలో ఇద్దరు హీరోయిన్లు ఉండటంతో తన పాత్ర ఏమిటని అడిగిందట. సెకెండ్ హీరోయిన్ అని చెప్పడానే ముఖం అదోలా పెట్టిందట. నేను సెకెండ్ హీరోయిన్ గా చేయను, వీలైదే ఫస్ట్ హీరోయిన్ పాత్రను ఇవ్వండి అందట. ఆ రోల్ కి ఆల్రెడీ ఓ టాప్ హీరోయిన్ ని ఫిక్సయిన ఆ దర్శకుడు కుదరదంటూ వచ్చేశాడట. మరో ఇద్దరు ముగ్గురు దర్శకులను కూడా ప్రణీత అలానే అడిగిందట. సెకెండ్ హీరోయిన్ గా చేయాలనుకోవడం లేదు, ఫస్ట్ హీరోయిన్ గా అయితేనే చేస్తాను అంటూ నిక్కచ్చిగా చెప్పేస్తోందట. ప్రస్తుతం జోరు సినిమాలో నటిస్తోన్న మరదలు పిల్ల, ఇక ఆ సినిమాతో సెకెండ్ హీరోయిన్ పాత్రలకు ఫుల్ స్టాప్ పెట్టేయాలని డిసైడయ్యిందన్నమాట. అప్పుడే ఈ పిల్ల ఇలా మాట్లాడుతోందేంటి అంటూ దర్శకులు అవాక్కవుతున్నారు. అయినా అందులో ఆమె తప్పేముందిలెండి! రాక రాక కాస్త కాలం కలిసొచ్చింది. జాగ్రత్తగా అడుగులు వేయకపోతే మళ్లీ దెబ్బతినడం ఖాయం. ఇలా రెండో లీడ్ గా చేసుకుంటూ పోతే ఇక అలాగే ఫిక్సయిపోతానని భయపడి కేర తీసుకుంటున్నట్టుంది. మరి దర్శక నిర్మాతలు అర్థం చేసుకుని మెయిన్ లీడ్ గా తీసుకుంటారో లేదో!

మరింత సమాచారం తెలుసుకోండి: