రాష్ట్రంలో పేరుగాంచిన ఒక ప్రముఖ ఛానల్ మారుతి సినిమాల ద్వారా సూపర్ హిట్స్ అందుకున్న యంగ్ హీరోలు శ్రీనివాస్ (ఈరోజుల్లో ఫేమ్) ప్రిన్స్ (బస్ స్టాప్ ఫేం) లతో ప్రస్తుత టాలీవుడ్ పరిశ్రమలో యంగ్ హీరోల పరిస్థితి పై నిర్వహించిన ఒక ఇంటర్వ్యు కార్యక్రమంలో తమకు సూపర్ హిట్ సినిమాలను తీసి ఇచ్చిన దర్శకుడు మారుతి పై సెటైర్లు విసిరారు. ఇప్పటిదాకా మారుతిని ప్రేక్షకులు విమర్సించారు అదేవిధంగా టాలీవుడ్ విమర్శకులు విమర్సించారు.  కానీ ఆయన సినిమాలలో నటించిన హీరోలు ఆ దర్శకుడినే విమర్శించడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మారుతి ‘ఈరోజుల్లో’ సినిమా హీరో శ్రీనివాస్ మాట్లాడుతూ తన తల్లి తండ్రులు సినిమాలలో నటించకపోయినా ఫర్వాలేదు కాని బూతు సినిమాలలో నటించ వద్దని గోల పెడుతున్నారని చెప్పడం అదేవిధంగా హీరో ప్రిన్స్ కూడా భవిష్యత్ లో తాను బూతు సినిమాలలో నటించనని చెప్పడం బట్టీ మారుతీ సినిమాల ద్వారా పైకి వచ్చిన యంగ్ హీరోలు ఆయన పైనే సెటైర్లు వేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.  ఎవరు ఎన్ని విమర్శలు చేసినా మారుతి హవా మాత్రం టాలీవుడ్ లో ప్రస్తుతం పరుగులు తీస్తోంది. రచయితగా, దర్శకుడిగా, సినిమా నిర్మాతగా మారుతికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈమధ్యనే మారుతి ప్రజెంట్ చేఇన ‘విల్లా’ సినిమా కోటిరూపాయలు కలేట్ చేసింది అనే వార్తలు కూడ వస్తున్నాయి. ఇప్పుడు ఇప్పుడే ఎదుగుతున్న యంగ్ హీరోలు దర్శకుడి పైనే సెటైర్లు వేయడం ఆశ్చర్యం కలిగించే వార్త. 

మరింత సమాచారం తెలుసుకోండి: