మెగా హీరో నుండి పొలిటికల్ మెగాస్టార్ గా నేడు రాష్ట్ర రాజకీయాలలో ఒక ముఖ్య కేంద్ర బిందువుగా కొనసాగుతున్న చిరంజీవి సమైఖ్యతా వాది అన్న విషయం అందరికి తెలిసిందే. ఆయన పుట్టుక నేపధ్యం కూడా కోస్తా ప్రాంతమే మెగా కుటుంబంగా ఈరోజు టాలీవుడ్ ను ఏలుతున్న చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సూపర్ హిట్ సినిమాలకు కోస్తా సీడెడ్ ప్రంతాలలోకన్నా నైజాం ఏరియాలోనే ఎక్కువ కలెక్షన్స్ వారి సినిమాలకు రావడం బట్టీ మెగా హీరోల సినిమాలు అంటే నైజాం ప్రాంత ప్రేక్షకులకు ఎంత క్రేజ్ ఉందో అర్ధం అవుతుంది.  1980 ప్రాంతంలోనే చిరంజీవి తన సినిమాలకు ఆరోజులలోనే కోటి రూపాయల వసూళ్ళు వచ్చేవి అంటే ఎవరైనా ఆశ్చర్య పోవలసిన విషయం. అదేవిధంగా చిరంజీవి తమ్ముడు పవన్ నటించిన ‘ఖుషీ’ సినిమా ఆరోజుల్లోనే 8 కోట్లు వసూలు చేసి నైజాం ఏరియాలో మెగా ఫ్యామిలీ స్టామినాను చాటింది. దానితరువాత చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నటించిన ‘మగధీర’ 20 కోట్లు వసూలు చేసి టాలీవుడ్ రికార్డును క్రియేట్ చేస్తే ఆ రికార్డును పవన్ ‘అత్తారిల్లు’ సినిమా25 కోట్లు వసూలు చేసి మరో చరిత్రను సృష్టించింది.  ఇలా తెలుగు సినిమా నైజాం రికార్డులన్నీ మెగా కుటుంబం హీరోలకే ఉన్నాయి. ఈ నేపధ్యంలో మరి కొద్దిరోజులలో జరగబోతున్న రాష్ట్ర విభజన ప్రభావం మెగా కుటుంబ హీరోల భవిష్యత్ సినిమాల నైజాం రికార్డులు ఎలా ఉంటాయి అన్న విషయం పై రకరకాల చర్చలు ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: