గత 27 సంవత్సరాలుగా టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరో వెంకటేష్ హవా ప్రస్తుతం టాలీవుడ్ లో మందగించింది. మారుతున్న పరిస్థుతులకు అనుగుణంగా కుర్ర హీరోలతో మల్టీ స్టార్ సినిమాలు చేస్తూ తన కెరియర్ ను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు వెంకటేష్. స్వతహాగా ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా ఉన్న వెంకటేష్ వివేకానందుడి రచనలు అంటే తెగ ఇష్టపడతాడు.  అటువంటి వెంకటేష్ ఈమధ్య విడుదలైన తన ‘మసాలా’ సినిమా ప్రొమోషన్ లో మీడియా వారితో మాట్లాడుతున్నప్పుడు మీడియా సమావేశానికి వచ్చిన వ్యక్తులలో ఒక వ్యక్తి సినిమాలకు గుడ్ బై చెప్పి మీరు కూడా రాజకీయాలలోకి రావచ్చు కదా అన్నప్పుడు వెంకటేష్ ఒక నిముషం కూడా ఆలోచించకుండా ప్రస్తుత రాజకీయాలు నిజాయితీ పరులకు పనికిరావనీ అంటు మనిషిలోని చెడు ప్రవర్తన పెంచుకోవాలి అనుకుంటే రాజకీయాలలోకి వెళ్లాలని కామెంట్స్ చేసారు.  అయితే చిరంజీవి రాజకీయాలలోకి వచ్చాడు కదా అన్న మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ రాజకీయాలలోకి రానంత సేపు చిరంజీవి టాలీవుడ్ లోని అందరివాడిగా ఉన్నాడని, రాజకీయాలలోకి వెళ్ళిన తరువాత కొందరి వాడుగా మిగిలిపోయాడు అంటూచిరంజీవి పై సెటైర్లు వేయడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: