మెగా స్టార్ చిరంజీవి ఎంత పెద్ద స్టారో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సుమారు 20 సంవత్సరాలకు పైగా తెలుగు చలన చిత్ర పరిశ్రమని ఏలిన ‘మగ మహారాజు’ అనేది అందరికి తెలిసిన విషయమే. చిరంజీవి, రజనీకాంత్ ఇద్దరు సమవుజ్జీలే, కాని రజిని రాజకీయాల్లోకి వెళ్ళకుండా తన పాపులారిటీ దేశవ్యాప్తంగా పెంచుకుంటే, మన ‘ముటా మేస్త్రి’ రాజకీయాల్లోకి తప్పటడుగు వేసి రాష్ట్రం లోనే కొంత అపకీర్తి మూట కట్టుకున్నారనేది వాస్తవం. సినిమాల పరంగా ఇద్దరి స్థాయి సమానం ఒకానొక సమయం లో రజిని కన్నా ముందే వున్నాడు మన మెగా స్టార్.  తెలుగు సినిమాల వరకు చూస్తే ఆయన వెళ్ళాక ఎవరు నెంబర్ 1 అనే అయోమయం, ‘ఇంద్ర’ రాకతో చేరిగిపోవటం ఖాయం. మళ్ళీ చిరు మేకప్ వేసుకోపోతున్నారని ఫిలిం వర్గాల సమాచారం. ఒక ప్రముఖ తమిళ దర్శకునితో అయన 150 వ సినిమా రాబోతున్నట్టు సమాచారం. నిర్మాత, హీరొయిన్, మ్యూజిక్ డిరెక్టర్, ఇతర విషయాలు ఇంకా తెలీదు. చిరు 150 వ చిత్రం మార్చ్ 27, 2014 న చిత్రీకరణ మొదలపెదతారట. చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాణ బాధ్యతలు స్వీకరిస్తారట. దర్శకత్వ భాద్యతలు రజిని కి రోబో ఇచ్చిన శంకర్ చేతికి వెళ్లనున్నట్టు సమాచారం. ఇదే కనుక నిజం అయితే ఇప్పటి వరకు 100 కోట్ల క్లబ్ లో స్థానం లేని తెలుగు సినిమా అలవోకగా ఆ ఫీట్ సాదిస్తుంది. చిరు మళ్ళీ సినిమాల్లోకి రావాలని చాలామంది చాలా కాలంగా కోరుకుంటున్న విషయం తెలిసిందే. చూద్దాం.. ఈ న్యూస్ ఎంతవరకు నిజమో. ఒకవేళ నిజం అయితే మాత్రం మెగా అభిమానుల ఆనందానికి హద్దు అదుపు ఉండదు. welcome back చిరు.

మరింత సమాచారం తెలుసుకోండి: