మెగా ఫ్యామిలీ హీరోల క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆ హీరోలకి ఓ చెడ్డపేరు కూడా ఉంది. ప్రతి విషయంలోనూ వేలు పెడతారని, దర్శకుడిని ప్రశాంతంగా పని చేసుకోనివ్వడని చాలామంది అంటూ ఉంటారు. కథను కూడా ఇష్టం వచ్చినట్టు కెలికేస్తుంటారనే కామెంట్లు కూడా చాలాసార్లు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు పవన్ గురించి అదే వినిపిస్తోంది. గబ్బర్ సింగ్ 2కి దర్శకత్వం వహించే అవకాశాన్ని సంపత్ నందికి ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అయితే అతడు పేరుకే దర్శకుడని, పెత్తనమంతా పవర్ స్టార్ దే నని కొందరు అంటున్నారు. స్క్రిప్టు వర్క్ మొత్తం సంపత్ నంది చేసేశాడట. అయితే దాన్ని ఎలా తీయాలని అన్నది మాత్రం పవన్ కళ్యాణే చెబుతున్నాడని టీమ్ లోని కొందరు లీక్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చిందని వినికిడి. అసలే పవర్ స్టార్. అతడితో పనిచేసే చాన్స్ రావడమే కష్టం. వచ్చింది కాబట్టి దాన్నికాదనుకోలేక, ఏమీ మాట్లాడలేక మౌనంగా కానిచ్చేస్తున్నాడట సంపత్ నంది. ఒకవేళ అతడు చెప్పింది కాదని తనకు నచ్చినట్టు తీస్తే, పొరపాటున ఏదైనా నెగిటివ్ రిజల్ట్ వస్తే, తన పని అయిపోతుందని అతడి అభిప్రాయమని చెబుతున్నారు. ఇవన్నీ నిజాలని అనలేం. అలా అని అబద్ధాలనీ కొట్టి పారేయలేం. వార్తయితే చక్కర్లు కొడుతోంది. వాస్తవం ఎలా ఉందో మాత్రం అర్థం కాకుంది. చిన్న దర్శకుడు కాబట్టి సంపత్ కాస్త తగ్గి ఉండొచ్చని నమ్ముతాం. కానీ ఓ దర్శకుడిని పవన్ మరీ అలా చీప్ గా చూస్తాడంటే మాత్రం నమ్మలేం. అతడి వ్యక్తిత్వం గురించి అందరికీ తెలిసి కూడా నమ్మడం కాస్త కష్టమే కదా మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: