కొందరు కాలంతో వచ్చిన మార్పులను స్వీకరిస్తూ పోతారు. ఇంకొందరు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉండాలని తపన పడుతుంటారు. అది అన్నిసార్లూ సాధ్యం కాదు. ఆ విషయం జెనీలియాకు అర్థం కావడానికి చాలా సమయం పట్టింది. చేతినిండా అవకాశాలు ఉన్నప్పుడే రితేశ్ దేశ్ ముఖ్ ను పెళ్లాడి ఇల్లాలి బాధ్యతల్లో పడిపోయింది. సినిమాల్లో నటించవా అని బోలెడంతమంది అడిగినా, కొన్నాళ్లు ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేసి వస్తానంది. అదే జెనీలియా చేసిన తప్పు. అసలు పెళ్లయితేనే అవకాశాలు రావంటే, వచ్చినవాటిని కూడా చెడగొట్టుకుంది. ఆ తర్వాత ఎప్పుడో వచ్చి చాన్సులు కావాలంటే ఎవరిస్తారు చెప్పండి! అదే అయ్యింది జెన్నీకి. నేను రెడీగా ఉన్నాను, మళ్లీ నటిస్తాను అని మైకు పట్టుకుని అరిచినా ఎవ్వరూ వినిపించుకోలేదు. కొందరు ఏవో పాత్రలు ఆఫర్ చేశారు కానీ హీరోయిన్ గా చేస్తాను తప్ప ఏవి పడితే అవి చేయనంది. ఫలితంగా ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. చూసి చూసి కళ్లు కాయలయ్యాయే తప్ప అవకాశం ఇచ్చినవాడే లేడు. దాంతో సర్దుకుపోక తప్పింది కాదు. ఎంత సర్దుకుపోవాల్సి వచ్చిందంటే... సల్మాన్ ఖాన్ నటిస్తోన్నస్టాలిన్ రీమేక్ లో ఓ పాత్ర చేస్తోందట జెనీలియా. పాత్ర చిన్నదే అయినా ప్రాముఖ్యత ఉన్నది అని చెప్పడంతో ఒప్పుకుందట. కొందరైతే అది సోదరి పాత్ర అని కూడా అంటున్నారు. హీరోయిన్ కానప్పుడు ఏదైతేనేం? పాపం పాప కాంప్రమైజ్ కాక తప్పలేదన్నమాట. ఇక దర్శకులంతా అక్కాచెల్లెళ్ల పాత్రలతో రెడీ అయిపోతారు చూస్తూ ఉండండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: