ప్రస్తుతం టాలీవుడ్ లో పవన్ వైబ్రేషన్స్ తో చాలామంది ప్రతిభావంతులైన దర్శకులు పవన్ పట్ల ఆకర్షితులై పవన్ తో సినిమా చేయడమే ప్రధాన ధ్యేయంగా వారికి వస్తున్న మంచి అవకాసాలను కూడా వదులు కుంటున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. దీనికి ఉదాహరణగా పవన్ విమర్శకులు దర్శకులు సంపత్ నందిని, శ్రీకాంత్ అడ్డాలను ఉదాహరణగా చూపెడుతున్నారు.  2011లో ‘రచ్చ’ విడుదల తరువాత సంపత్ నంది పవన్ కళ్యాణ్ ను నమ్ముకుని మరే సినిమా చేయకుండా పవన్ ‘గబ్బర్ సింగ్ 2’ ఎప్పుడు మొదలు పెడతాడా అని ఆలోచిస్తూ రోజులు గడిపెస్తున్నాడని వీరివాదన. అదేవిధంగా శ్రీకాంత అడ్డాల కూడా శ్రీకాంత్ అద్దాల కూడా పవన్ తో సినిమా చేయాలని కోరిక ఉన్నా పవన్ ఇప్పటికీ ఎటూ తేల్చక పోవడంతో విధి లేక నాగబాబు కుమారుడి సినిమాకు ఓకె చెప్పాడు అని అంటారు. ఇంతమంది దర్శకులు తమకు వస్తున్న అవకాసాలను కూడా వదులుకుని కేవలం పవన్ డేట్స్ గురించి వెయిట్ చేయడానికి గల కారణం పవన్ మార్కెట్ ఒకటే కాదు తన దగ్గరకు వచ్చే ఏ వ్యక్తితో అయినా అత్యంత ఆత్మీయంగా పవన్ మాట్లాడే మాటతీరు వల్ల తమకు పవన్ ఇచ్చే అవకాశాలు గురించి సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తున్నారు అనే మాట కూడా ఉంది.  కానీ పవన్ మాత్రం తన దగ్గరకు వచ్చే ఏ దర్శకులను తన గురించి వెయిట్ చేస్తూ అవకాశాలు పోగొట్టుకోవద్దని ఈ గేప్ లో మరో సినిమా తీసి తన వద్దకు రమ్మని చెప్పినా ప్రతిభావంతులైన చాలామంది దర్శకులు కేవలం పవన్ గురించి ఇలా కాచుకుని కూర్చోవడం పవన్ కు కూడా ఇబ్బందిగా మారింది అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: