డిసెంబర్ వచ్చేస్తున్నా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ఇంతవరకు '1' సినిమా పనులు పూర్తి కావడంలేదు. ఎదో ఒక అవాంతరం '1' సినిమా పనులను ముందుకు నడవనీయకుండా చేస్తోందట. దానితో దాదాపు రెండేళ్లుగా ఈ చిత్రం కోసం పనిచేస్తున్న మహేష్ బాబు దర్శకుడు సుకుమార్ పై తీవ్ర అసహనంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికికారణం ఈ చిత్రం విజువల్‌ ఎఫెక్ట్స్‌ వర్క్‌ ఇంకా జరుగుతూ ఉందట. అది సకాలంలో పూర్తవుతుందా? ఇన్నాళ్ల తర్వాత వస్తున్న సినిమా కాబట్టి అందుకు తగ్గ క్వాలిటీ ఉంటుందా? అనే అనుమానాలు మహేష్ ని వేమ్తాడుతున్నాయట.  మరీ ఇంత నిదానంగా తీస్తే ఎలాగంటూ మహేష్‌ సుకుమార్ కు క్లాస్ పీకాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసమని మహేష్ చాలా కష్టపడ్డాడు. బాడీ ఫిట్‌గా ఉంచుకునేందుకు పర్సనల్‌ ట్రెయినర్‌ని సొంత ఖర్చులతో పెట్టుకున్నాడు. తానెంత కష్టపడినా, ఎన్ని రోజులు కాల్షీట్లు ఇచ్చినా ఇంకా ‘1‘పూర్తి కాకపోవడం పట్ల మహేష్‌ మండి పడ్డాడని, ప్రిన్స్‌ కోపంతో ప్రస్తుతం మొత్తం యూనిట్‌ ఎలర్ట్‌ అయి రేయింబవళ్లు పని చేస్తూ సంక్రాంతికి సినిమా వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకే ఏడాదిలో రెండు సినిమాలు విడుదల చేయాలని మహేష్‌ ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు కానీ తనతో పని చేసే దర్శకుల్లో ఎక్కువ మంది టైమ్‌ తినేస్తు ఉండటం మహేష్ కు తల నొప్పిగా మారుతోంది.  ఈ సమస్యలు కనీసం వచ్చే సంవత్సరం అయినా తలేత్తకూడదు అన్న ఉద్దేశ్యంతో నిన్ననే మహేష్ ‘ఆగడు’ సినిమా షూటింగ్ ను ప్రారంభించాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: