పాటలు సూపర్ హిట్ అయి ట్రేడ్ వర్గాలలో మంచి క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమాకు వచ్చినన్ని కష్టాలు ఈమధ్య కాలంలో ఏ తెలుగు సినిమాకు వచ్చి ఉండవు. డిసెంబర్ లో విడుదల అధికారికంగా ప్రకటించి నప్పటికీ ఈసినిమా మహేష్ బాబు సినిమా వన్ తోనే తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ద పడుతున్నట్లుగా కనిపిస్తోంది. భారీ సినిమాగా రూపొందిన ‘ఎవడు’ అత్యంత భారీ సినిమాగా రూపొందిన వన్ తో పోటీ పడాలి అంటే దానికి సంబంధించిన ప్రచారం కూడా చాల వెరైటిగా ఉండాలని అటు దిల్ రాజ్ ఇటు రామ్ చరణ్ కూడా భావిస్తున్నారట.  దీనికి తగ్గట్టుగానే మెగా అభిమానులకు జోష్ ఇచ్చే విధంగా ఒక లేటెస్ట్ ప్లాన్ దిల్ రాజ్ రామ్ చరణ్ సహకారంతో రచించాడు అని అంటున్నారు. ‘ఎవడు’ సినిమాలో అల్లుఅర్జున్ ఒక ప్రత్యేక పాత్రలో కేవలం పది నిముషాలు మాత్రమే కనిపించినా ఈసినిమాలో హీరోగా చేస్తున్న చరణ్ బన్నీలు ఒకే సన్నివేశంలో కనిపించే సీన్స్ ఉండవు. అందుకని ఆలోటును తీర్చేందుకు రామ్ చరణ్ అల్లుఅర్జున్ లపై ‘ఎవడు’ సినిమాకు సంబంధించి ఒక ప్రచార గీతం (ప్రోమో సాంగ్) చిత్రీకరిస్తారట.  ఎవడు సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ పక్కాగా ఫైనల్ అయిన తరువాత ఈ ప్రోమోషనల్ సాంగ్ ను అన్ని ఛానల్స్ లోను ఊదరగొట్టి ఈసినిమాకు మళ్ళీ మంచి క్రేజ్ తీసుకు వచ్చి భారీ ఓపినింగ్స్ వచ్చేలా దిల్ రాజ్ పధకం రచిస్తున్నాడని టాక్. ఈ ప్రత్యేక గీతంలో నటించేందుకు రామ్ చరణ్ బంనీలు కూడా అంగీకరించారు అని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: