టాప్ హీరోలు అంతా పెద్ద పెద్ద నిర్మాతల ప్రొడక్షన్ కంపెనీల వైపు చూస్తూ ఉంటె పవన్ మాత్రం తన సినిమాల కాల్షీట్స్ సమస్యలలో ఉన్న నిర్మాతలకు ఇచ్చి ఆదు కుంటూ ఉంటాడు. ఈ మధ్య కాలం లో పవన్ బ్లాక్ బస్టర్స్ గామారిన ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’ సినిమాలను నిర్మించిన నిర్మాతలు బండ్ల గణేష్ ,ప్రసాద్ లు ఈ సినిమాలను తీయకముందు చాలా ఆర్ధిక సమస్యలలో ఉన్నారన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో రామ్ చరణ్ తో ‘ఆరంజ్’ సినిమా తీసి పీకల లోతులో ఆర్ధిక సమస్యలలో పవన్ అన్న నాగబాబు కూరుకుపోయి ఉన్నప్పుడు పవన్ సహాయం చేసి నాగబాబును గట్టెక్కించాడు అన్న విషయం ఓపెన్ సీక్రెట్. ఇటువంటి నేపధ్యంలో ఎందరికో తన సినిమాలు తీసే అవకాసం ఇస్తున్న పవన్ ప్రస్తుతం నాగబాబుకు తనను హీరోగా పెట్టుకుని సినిమా తీసే ఛాన్స్ ఎందుకు ఇవ్వడం లేదు అనే ఆశక్తికర చర్చ జరుగుతోంది. గతంలో పవన్ హీరోగా వచ్చిన ‘గుడుంబా శంకర్’ సినిమాను కూడా నాగబాబు తన సొంత బేనర్ పై తీసి చేతులు కాల్చుకున్నాడు.  నిన్న ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ తాను నిర్మాతగా పనికిరానని తనకు 50 సంవత్సరాలు వచ్చిన తరువాత తెలిసిందని ఈ పరిస్థుతులలో భవిష్యత్తులో తనకు కోట్లు కలిసివచ్చినా తాను సినిమాలు తీయనని తనకు సినిమాలు నిర్మించే విషయాలు అన్నీ తెలిసినా ఎందుకో ఆర్ధిక వ్యవహారాలలో తన తెలివి తేటలు సరిపోవడంలేదని అని అన్నాడు నాగబాబు. బహుశా నాగబాబు ప్రస్తుత ఆలోచనా సరళి తెలుసు కాబట్టే పవన్ నాగబాబును మళ్ళీ ఆ సమస్యల వలయంలోకి దింపడం ఇష్టంలేదు అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: