ఈ మధ్య హీరోలంతా వాయిస్ ఓవర్లు ఇవ్వడంలో బిజీ అయిపోతున్నారు. గతంలో వాయిస్ ఓవర్ ఇవ్వడమనేది చాలా అరుదుగా జరిగేది. అలాంటప్పుడు ఏ దర్శకుడో, సంగీత దర్శకుడో తమ గొంతును వాడేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. వాయిస్ ఓవర్ అంటూ ఇవ్వడం జరిగితే... హీరోలే ఇవ్వాలని డిసైడైపోయారు మన దర్శకులు. అందుకే మహేశ్ బాబు దగ్గర్నుంచి నాని వరకూ అందరి గొంతులనూ అరువు తీసుకుంటున్నారు. కొందరయితే, కథకు అవసరం లేకపోయినా కూడా పనిగట్టుకుని వాయిస్ ఓవర్ కు తమ సినిమాల్లో స్థానం కల్పిస్తున్నారని వినికిడి. అందుకు కూడా సొమ్ములు బాగానే ముట్టడం వల్ల కొంత, సాటి హీరోలతో ఉన్న స్నేహం వల్లనో కొంత మన హీరోలు కూడా గొంతులు అరువివ్వడానికి వెనుకాడట లేదు. అందరూ చేస్తున్నప్పుడు నేను మాత్రం ఎందుకు ఊరుకోవాలి అనుకున్నాడో ఏమో... నారా రోహిత్ కూడా వాయిస్ ఓవర్ చెప్పడానికి సిద్ధపడ్డాడు. ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రానికి రోహిత్ తన గొంతును అద్దెకిచ్చాడని సమాచారం. డిసెంబర్ ఆరో తేదీన విడుదల కానున్న ఈ చిత్రానికి రోహిత్ స్వరం స్పెషల్ అట్రాక్షన్ అంటున్నారు చిత్ర యూనిట్.  ఒకరి తరువాత ఒకరుగా హీరోలంతా ఇలా వరుసగా తమ గొంతులను అరువివ్వడం చూస్తుంటే కాస్త వింతగాను, మరికాస్త సరదాగానూ లేదూ! చూస్తుంటే మన హీరోలకు వాయిస్ ఓవర్ ఇవ్వడమనేది సైడ్ బిజినెస్ గా మారిపోయేలా ఉంది. ఏమంటారు!

మరింత సమాచారం తెలుసుకోండి: