ఎక్కడో ఓ మూలన ఏదో పని చేసుకుపోయేవాళ్లను ఒక్కసారిగా సూపర్ స్టార్లను చేయాలంటే... అది మీడియాకి మాత్రమే సాధ్యం. అందుకు అనసూయే సాక్ష్యం. ఓ మామూలు యాంకర్ అయిన ఈ సుందరాంగి ఉన్నట్టుండి చాలా పాపులర్ అయిపోయింది. కానీ అది ఆమెకు మంచి కంటే చెడే ఎక్కువ చేసింది. > ఓ న్యూస్ చానల్లో పని చేసుకునేది అనసూయ. అక్కడ మేనేజ్మెంట్ తో ఒక విషయంలో సున్నం పెట్టుకుని బయటకు వచ్చేసిందని చెబుతారు. ఆ తరువాత ఫ్రీలాన్స్ యాంకర్ గా అవతారమెత్తింది. అక్కడి నుంచే మొదలైంది ఆమె హవా. ఏ చానెల్లో చూసినా ప్రత్యక్షమైపోయేది. ఇంటర్వ్యూలు, లైవ్ షోలు, రియాలిటీ షోలు అంటూ నానా హంగామా చేసింది. అయితే జబర్దస్త్ షో ఆమె జీవితాన్నే మార్చేసింది. పొట్టి పొట్టి దుస్తులతో రెచ్చగొట్టేలా ఉండే అనసూయను చూసి అందరూ మనసులు జారబెట్టుకున్నారు. అబ్బో అనసూయ అహో అనసూయ అంటూ ఆమె జపమే చేయసాగారు. మీడియా కూడా అనసూయకు తిరుగులేదు అంటూ ఊకదంపుడు వార్తలలో ఊదరగొట్టింది. ఇక ఎక్కడికో వెళ్లిపోతుందామె అనుకున్నారంతా. కానీ అలా జరగలేదు. ఏమయ్యిందో ఏమో... అనసూయ సడెన్ గా సైలెంట్ అయిపోయింది. ఏ ప్రోగ్రామ్ ఒప్పుకోవడం లేదు. ఎవరు ఆఫర్ ఇచ్చినా ఎస్ అనడం లేదు. చివరకు పవన్ కళ్యాణ్ సినిమాలో చాన్స్ వచ్చినా కూడా దిగిరాలేదు. ఏదైనా మాట్లాడమంటే కుదరదంటుంది. ఫొటో కావాలంటే కయ్యిమంటుంది. తాజాగా అనసూయను అమెరికా రమ్మని ఆహ్వానించారట. యునైటెడ్ స్టేట్స్ లో పెద్ద ఎత్తున జరగనున్న ఓ మ్యూజికల్ షోకి యాంకరింగ్ చేయమని కోరారట. కానీ తనకు కుదరదని చెప్పేసిందట అనసూయ. కాస్త పెద్ద మొత్తం ఇస్తామని చెప్పినా న అందట. తనకు ఏమాత్రం ఆసక్తి లేదని, మరెవరినైనా చూసుకొమ్మని మొహమాటం లేకుండా చెప్పేసిందని అందరూ గుసగుసలాడుతున్నారు. ఇండస్ట్రీవారు మాత్రం ఏమయ్యింది ఈ అనసూయకి అంటూ జుట్లు పీక్కుంటున్నారు. ఇలా వచ్చిన ఆఫర్లన్నిటినీ వదిలేసుకుని ఈ సుందరాంగి ఏం చేద్దామనుకుంటోంది! ఆ గ్లామర్ కాస్తా తగ్గిందంటే వీళ్లెవరూ ఆమె ముఖం చూడరు. ఏదైనా చేయాలంటే ఇప్పుడే చేయాలి. ఆ విషయం అనసూయకి ఎందుకు అర్థం కావడం లేదో ఏంటో!

మరింత సమాచారం తెలుసుకోండి: