సినిమా రంగం అంటేనే ఒక మాయా ప్రపంచం ఇక్కడ సమర్ధత కన్నా అదృష్టం ఇమేజ్ కళాకారుడి మార్కెట్ ను నిర్దేశిస్తూ ఉంటుంది. ఇమేజ్ ఉన్న వారి చుట్టూనే కోట్లు గుమ్మరిస్తాము అంటూ నిర్మాతలు రూపాయల కట్టలను పట్టుకుని తిరుగుతూ ఉంటారు. నటీనటులు కూడా తమ పాపులారిటీని వీలైనంత ఎక్కువ సొమ్మును సంపాదించుకోవడానికి వాడుకుంటూ ఉంటారు. సినిమారంగంలో పాపులారిటీ తగ్గిపోతే అతడు గతంలో ఎన్ని ఘన విజయాలు సాధించినా వెంటనే లిస్టులోంఛి తీసి పడేస్తారు.  అందుకోసమే సినిమా రంగంలోని కళాకారులు అంతా తమతమ పాపులారిటీని పెంచుకోవడానికి రకరకాల ఎత్తులు వేస్తూ ఉంటారు. ఉత్తర భారత దేశం నుంచి దక్షిణాదికి వచ్చిన సింగర్ బాబా సెహగల్ పబ్లిసిటీ పెంచుకోవడానికి తనదైన రీతిలో మరో కొత్త అడుగు వేసాడు. టాలీవుడ్ లో బాబా సెహగల్ పాటలకు మంచి క్రేజ్ ఉండటంతో ఆ క్రేజ్ ను మరింత పెంచుకోవడానికి దానితోపాటు పవన్ కళ్యాణ్ పాపులారిటీని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ‘పవనిజం' సాంగును విడుదల చేసి సక్సెస్ సాధించాడు. ఇది సరిపోనట్లు బాబా సెహగల్ లేటెస్ట్ గా చిరంజీవిపై కూడా ఓ పాటను విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.  ‘హలో చిరు హలో చిరు హౌ ఆర్ యు' అంటూ సాగే ఈ పాటను త్వరలో విడుదల చేయబోతున్నారు. ఇటీవల ఈ పాటకు సంబంధించిన టీజర్ విడుదల చేసిన బాబా సెహగల్ త్వరలోనే పూర్తి పాటను విడుదల చేస్తానని అంటున్నాదు. ప్రస్తుతం చిరంజీవి ఇమేజ్ బాగా మందగించిన నేపధ్యంలో మెగా అభిమానులలో బాబా సెహగల్ చేస్తున్న ఈ కొత్త ప్రయత్నం చిరంజీవికి ఎంత వరకూ అనుకూలిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: