కన్నడ మందారం ప్రణిత ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ కళ్యాన్ తో పాటు తన చెల్లి సమంతాతో కలిసి హంసనందిని, ముంతాజ్ తో కలిసి చిందులేసి ఎంత హడావిడి చేసిందో ఆ సినిమా చూసిన వారందరికీ జ్ఞాపకమే. ఈ బెంగుళూరు ముద్దుగుమ్మ ప్రణీత మరోసారి పబ్ లో హడావిడి చేస్తోంది. అయితే ఈసారి పవన్ కాకుండా హీరో ఉపేంద్రను ఎంచుకుంది.  ప్రస్తుతం కన్నడ తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా ‘బ్రహ్మ’ గా విడుదల కాబోతోంది. ఉపేంద్రకు టాలీవుడ్ లో ఉన్న మార్కెట్ రీత్యా ఈ సినిమాను ‘ఉపేంద్రుడు’ గా తెలుగులో తీసుకువస్తారట. ఆర్.చంద్రు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కూడా ఉపేంద్ర, ప్రణీతల పై ఓపబ్ సాంగ్ ను ఈమధ్య ఒక ప్రముఖ పబ్ లో చిత్రీకరించారు. ఈ పాట ఈ సినిమాకి ఓ హైలెట్ గా నిలుస్తుందని చిత్రయూనిట్ పేర్కొంటోంది. రెండు భాషల్లోనూ ప్రణీతనే హీరోయిన్ గా ఎంచుకున్నారు.  ఈసినిమాను సంక్రాంతి తరువాత టాలీవుడ్ లో విడుదల చేస్తారట. ఒకప్పుడు తెలుగులో కూడా ఉపేంద్రకు మంచి ఇమేజ్ ఉండేది. కానీ అది రానురాను తగ్గిపోవడంతో ఉపేంద్ర సినిమాలు టాలీవుడ్ లో ఎప్పుడు వచ్చి వెళ్లిపోతయో కూడా అర్ధం కావడంలేదు. ఈ పరిస్థుతులలో తెలుగులో ప్రస్తుతం ప్రణితకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఉపేంద్ర మార్కెట్ డల్ గా ఉన్నా ప్రణిత ఇమేజ్ ని కేష్ చేసుకోవడానికి నిర్మాతలు చేస్తున్న ప్రయత్నం ఉపేంద్ర కు ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: