టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తే చూడాలని ప్రిన్స్ అభిమానులు ఎప్పటి నుంచో ఆశ పడుతున్నారు. మహేష్ కు కూడా రాజమౌళి సినిమాల పట్ల విపరీతమైన ఇష్టం ఉన్నా వారిద్దరిని కలిపే ప్రాజెక్ట్ ఏది ఇంతవరకూ ఆలోచనకు కూడా రాలేదు. కానీ టాలీవుడ్ లోని ప్రతిహీరో రాజమౌళి దర్శకత్వంలో నటించాలని కోరుకుంటూ ఉంటారు. మహేష్ కు తీరని కోరిక మహేష్ బావ సుధీర్ బాబుకు తీరేలా కనిపిస్తోందని వార్తలు వస్తున్నాయి. దీనికోసమే సన్నంగా ఉండే సుధీర్ బాబు ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ సినిమా కోసం కండలు పెంచినా ఆ బాడీ రాజమౌళి ‘బాహుబలి’ కోసమే అని అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోలలో పోటీ విపరీతంగా ఉంటోoది కాబట్టి మహేష్ తన బావ సుధీర్ కు మంచి బ్రేక్ ఇచ్చే ఉద్దేశ్యంలో రాజమౌళి బాహుబలి సినిమాలో ఒక ముఖ్య పాత్ర ఇమ్మని ప్రిన్స్ మన జక్కన్నను అడిగాడని ఎవర్ని ఏమి ఎప్పుడూ అడగని ప్రిన్స్ మహేష్ ఇలా అడగడంతో రాజమౌళి కూడా ఈ విషయమై సీరియస్ గా ఆలోచిస్తున్నాడు అంటూ వార్తలు తెగ వినపడుతున్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియదు కాని ఈ వార్తలే నిజం అయితే మహేష్ బావ సుధీర్ బాబు సుడి తిరిగి నట్లే అని అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: