పని విషయంలో మహేశ్ బాబు కమిట్ మెంట్ గురించి అందరికీ తెలిసిందే. అనుకున్న పని అనుకున్న టైముకి పూర్తి చేయడం అలవాటు అతడికి. అలాంటిది అతడే విసిగిపోయాడంటే... పరిస్థితి ఏ స్థాయికి వచ్చి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ అతడికి అంత విసుగు తెప్పించింది ఏమిటనేగా? ఇంకేముంది... నేనొక్కడినే సినిమా. సుకుమార్ తో సినిమా అంటే హీరోలంతా ఇష్టంగానే ఉంటారు. అతడి టేకింగ్, ఇంటెలిజెన్స్ అలాంటివి మరి. కానీ ఓ దర్శకుడికి అవి ఉంటే చాలా? సమయానికి సినిమా పూర్తి చేయగలగడం, బడ్జెట్ ని కంట్రోల్ చేయడం వంటివి కూడా తెలియాలిగా? అవి తెలియలేదు సుకుమార్ కి. అందువల్లే ఆ సినిమా బడ్జెట్ తడిసి మోపెడయ్యింది. ఇప్పటి వరకూ సినిమా రిలీజుకు దగ్గర పడకుండా ఉంది.నేనొక్కడినే చిత్రాన్నిసంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అది సాధ్యం అయ్యేలా లేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఆ సినిమాలో ఇప్పటికీ ఒక పాట మిగిలే ఉందట. దానితో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన వర్క్ కూడా పూర్తి కావాల్సి ఉందట. ఇంత పని ఉండగా సంక్రాంతికి రావడం అన్నది అసాధ్యం. అందుకే మహేశ్ ఇక సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్టే అంటున్నారంతా. అయితే ఈ విషయంలో మహేశ్ చాలా కోపంగా ఉన్నాడని వినికిడి. చిత్రం ఎంతకీ పూర్తి కాకపోవడం అతడికి విసుగు తెప్పిస్తోందట. ఓ దశలో పూర్తిగా విసిగిపోయి, ఆ సినిమాను పక్కన పెట్టేసి 'ఆగడు'కి కొబ్బరి కాయ కొట్టించేశాడని వినికిడి. ఓ స్టార్ హీరో విసిగిపోయే రేంజ్ లో సినిమాని తీయడం సుకుమార్ కే చెల్లిందేమో. ఇలా అయితే సుకుమార్ కెరీర్ కూడా తీవ్రంగా దెబ్బతినడం ఖాయం!

మరింత సమాచారం తెలుసుకోండి: