తెలుగు సినిమా ప్రేక్షకులకి అతిధి సినిమాతో దెగ్గర ఆయన అమ్రిత ఆ సినిమా పెద్దగ పేరు రాకపోయినా మహేష్ బాబు కి మంచి జోడి అని పేరు కొట్టేసింది అమ్రిత. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గ పేరు ఉన్న ఈ హీరోయిన్ మెల్లగా తెరవేనుకకి వెళ్లిపోయింది. అడపాదడప హిందీ సినిమాలు చేస్తున్న అవి పెద్దగ ఆడకపోడం వల్ల ఎవ్వరు తనని పట్టించుకోడం లేదు.  అయతే ఇటివలే ఒక మంచి పని చేసి వార్తల్లో ఎక్కేసింది మన ముద్దు గుమ్మ, తను నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ కోసం బయల్దేరిన అమ్రితా మార్గ మధ్యలో ఇద్దరు ఆటో డ్రైవర్స్ ఒక వంటరి యువతిని ఏడిపించడం చూసింది, వెంటనే కార్ ఆపేసి వాళ్ళని వారించి ఆ అమ్మాయిని  సురక్షితమయిన ప్రాంతానికి పంపించింది.  అయతే ఆ తరువాత కార్ దెగ్గరికి వెళ్తున్న అమ్రిత పైన ఎటాక్ చెయ్యడానికి ఆటో డ్రైవర్స్ ప్రయత్నించారు , అది గ్రహించిన అమృత డ్రైవర్ వెంటనే కార్ వాళ్ళకి అడ్డుగా ఆపేసి ఆమెని ఎక్కించేసి తీసుకెళ్ళాడు. వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చిన అమ్రిత ఆ ఆటో డ్రైవర్స్ అరెస్ట్ చెయ్యాలని కోరింది. వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. అమ్రిత చేసిన ఆ సాహసాన్ని బాలీవుడ్ తారలు అబినందించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: