మణిరత్నం సినిమాలో నటించడమంటే... హాలీవుడ్ సినిమాలో నటించడంలా ఫీలవుతారు నటీనటులంతా. ఆయన స్టాండర్డ్స్, ఆయన సినిమా టెక్నిక్స్... అన్నీ డిఫరెంట్. అందరూ ఒక దృష్టితో చూసేదాన్ని ఆయన వేరే దృష్టికోణంతో చూస్తారు. అదే ఆయన ప్రత్యేకత.అయితే చాన్నాళ్లు విజయం ఆయనను వెక్కిరిస్తూనే ఉంది. విలన్, కడలి లాంటి చిత్రాలు ఆయన ఇమేజ్ ను బాగా దెబ్బతీశాయి. కడలి సినిమా అయితే ఆయన్ను అప్పుల్లోకి నెట్టింది. కానీ ఆయనంటే ఉన్న ఇష్టం, ఆయన సినిమాలంటే ఉన్న క్రేజ్ మాత్రం జనాల్లో ఇంకా తగ్గలేదు. అందుకే ఆయనకు ఇప్పటికీ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో చిత్రానికి ముహూర్తం పెట్టారు మణిరత్నం. ఓ చక్కని ప్రేమకథా చిత్రానికి అక్షరరూపం ఇచ్చారు. దాన్ని చిత్రించేందుకు సర్వ సన్నాహాలూ చేస్తున్నారు. చిత్రం పేరు కాట్రు. అంటే గాలి అని అర్థమట. దర్శకుడు ఫాజిల్ కొడుకును హీరోగా తీసుకోవాలని మణిరత్నం ప్లాన్ చేస్తున్నారని వినికిడి. ఆయన చాన్స్ ఇస్తానంటే ఎవరు కాదంటారు? ఆయన సినిమా తీస్తానంటే ఎవరు చూస్తానంటారు? కొన్నిఅయిడియాలు దెబ్బ తిన్నంత మాత్రాన జీనియస్ జీనియస్ కాకుండా పోతాడా? కొన్ని సినిమాలు ఫెయిలైనంత మాత్రాన మణిరత్నం మణిరత్నం కాకుండా పోతాడా!

మరింత సమాచారం తెలుసుకోండి: