టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు బావ అయిన యంగ్ హీరో సుధీర్‌బాబు కెరియర్ ఇప్పుడు బాగా నడుస్తోంది. అదృష్టంతో పాటు మహేష్ ప్రోత్సాహం బాగా ఉండడంతో నెమ్మదినెమ్మదిగా సుదీర్ బాబు తన కెరియర్ ను ప్లాన్డ్ గా నడిపించు కుంటున్నాడు. సుధీర్ బాబు హీరోగా అస్మితా సూద్ హీరోయిన్ గా నటించిన 'ఆడు మగాడురా బుజ్జీ‌' సినిమా ఈ శుక్రువారం విడుదల కాబోతోంది.  పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం కోసం హీరో సుధీర్ బాబు బాగా కష్టపడ్డాడని టాలీవుడ్ టాక్. ముఖ్యంగా సిక్స్ ప్యాక్ పెంచటం కోసం హీరోసుధీర్ బాబు ఏడాదిన్నరపాటు అన్నం కూడా తినకుండా ఈసినిమాకు కష్ట పడ్డాడట. అంతేకాదు కేవలం కూరగాయలు, పండ్లముక్కలే తీసుకుని, రోజుకు 14 గంటల చొప్పున కష్టపడి సిక్స్‌ప్యాక్‌ను పెంచాడట. అయితే ఈ సినిమా కోసం సుధీర్ బాబు చేస్తున్న కఠోర శ్రమను చూసి మహేష్ సుదీర్ ను మందలించాడు అని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి.  అయితే సుధీర్ ఈసినిమా కోసం పడిన కష్టాన్ని మహేష్ ఈసినిమా ఫైనల్ కాపీ చూసి మెచ్చుకున్నాడట. ఈ సినిమాతో సుధీర్‌బాబుకు హ్యాట్రిక్ హిట్ రావడం ఖాయం అని కూడా అంటున్నాడట మహేష్. సుధీర్ పై టాలీవుడ్ ప్రిన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని ఎంత వరకు గట్టెక్కిస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: