హృద‌య‌కాలేయం మూవీతో టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు ప‌రిచ‌యం అవుతున్న కొత్త హీరో సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్ బాబు అంటే ఇప్పుడు టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది. ఇత‌గాడు రిలీజ్ చేసిన హృద‌య‌కాలేయం ఫ‌స్ట్‌లుక్ యూట్యూబ్‌లో విప‌రీత‌మైన ఆధ‌ర‌ణ‌ను పొందింది. దాంతో సంపూర్ణేష్‌బాబు టాలీవుడ్ బ‌డా ద‌ర్శకుల మ‌దిలో ప‌డ్డాడు. ఆ విధంగానే టాప్ డైరెక్టర్ రాజ‌మౌళి, సంపూర్ణేష్ బాబు అప్‌క‌మింగ్ ఫిల్మ్ హృద‌య‌కాలేయంను తెగ మెచ్చుకున్నాడు. దీంతో సంపూర్ణేష్‌బాబు ద‌శ తిరిగిపోయింది. బ‌ర్నింగ్‌స్టార్ పేరుతో టాలీవుడ్‌లో ర‌చ్ఛ ర‌చ్ఛ చేస్తున్నాడు. లేటెస్ట్‌గా హృద‌య‌కాలేయం మూవీకు సంబంధించిన ట్రైల‌ర్ రిలీజ్ అయింది. ఇందులో బ‌ర్నింగ్ స్టార్ చెప్పిన ఫ‌న్నీ డైలాగులు, అంద‌ర్నీ తెగ న‌వ్విస్తున్నాయి. అంతే కాకుండా మ‌రో సూప‌ర్ క‌మెడియ‌న్ టాలీవుడ్‌కు ప‌రిచ‌యం కాబోతున్నాడు అనే ఫీలింగ్‌లో సినీ అభిమానులు కూడ తెగ ఆస‌క్తితో ఉన్నారు. మొత్తంగా బ‌ర్నింగ్ స్టార్ త‌న మూవీను రిలీజ్ చేసుకోకుండానే టాలీవుడ్‌లో మ‌రింత పాపుల‌ర్ అయ్యాడు. ఇదిలా ఉంటే త‌న ఫిల్మ్‌, హృద‌య‌కాలేయంలో టాప్ హీరోల‌ను ఇమిటేష‌న్ చేశాడ‌ని టాక్స్ వినిపిస్తున్నాయి. పెద్ద పెద్ద హీరోల‌ను, ద‌ర్శకుల‌ను ఇష్టం వ‌చ్చిన‌ట్టు ఇమిటేట్ చేశాడంటూ ఫిల్మ్‌న‌గ‌ర్‌లో జోరుగా మాట‌లు వినిపిస్తున్నాయి. కొత్తగా టాలీవుడ్‌కి ప‌రిచ‌యం అవుతూ, అప్పుడే హీరోల మీద జోకులు వేస్తూ ఇమిటేట్ చేయ‌డం అవ‌స‌ర‌మా అని స‌న్నిహితులు బ‌ర్నింగ్‌స్టార్‌కి హిత‌బోధ చేస్తున్నారంట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: