బర్నింగ్ స్టార్ వస్తున్నాడు సినిమా ఇండస్ట్రీలో బాబులకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. వారసత్వంగా వస్తున్న హోరోయిజానికి గుర్తుగా వారి అబ్బాయిలను ‘బాబు’ అని పిలుస్తూ ఉంటారు సినీ ఇండస్టీ వాళ్లు. కానీ ఏ బ్యాగ్ గ్రౌండ్ లేకుండా ఈ మద్య యూట్యూబ్ లో, ఇంటర్ నెట్లో తెగ సందడి చేస్తున్నాడు ఈ బాబు. ఇంతకీ ఎవరీ బాబు అనుకుంటున్నారా ! అదే నండి మన సంపూర్నేష్ బాబు... అయన్నే బర్నింగ్ స్టార్ అని అని కూడా అంటున్నారు. వెబ్ ప్రపంచంలో ఒక్క ఊపు ఊపిన మన బాబు ‘హృదయ కాలేయం’ అనే సినిమాలో కథానాయకుడిగా వస్తున్న సంగతి అందరికీ తెలుసు. గతంలో ఈ సినిమా తాలుకు ట్రైలర్ లాంచ్ విడుదల చేశాడు. యూట్యూబ్ లో అది ఒక్క ఊపు ఊపింది. అందులో డైలాగ్ లు ఎంత పేరడీ అంటే ఇప్పటికీ ఆ డైలాగ్స్ మారు మోగుతూనే ఉంటున్నాయి. నేను కత్తిపట్టి నరకడం మొదలు పెడితే బొక్కలేరడానికి ప్రొక్లైనర్ రావాలి, రక్తం పారడానికి డ్రైనేజులు తొవ్వాలి. నా పేరు చెబితే ఉచ్చ ఉచ్చ పోయాలి పోయిస్తా.. ఈ చేతుల్తో పోయిస్తా అంటూ భారీ డైలాగులు వీక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఉన్నాయి. అయితే ఈ బర్నింగ్ స్టార్ మళ్ల ‘హృదయ కాలేయం’ టీజర్ తో మళ్ల మన ముందుకు వచ్చాడు. ఈ సారి మరింత భారీ డైలాగ్ లతో ‘పులికి ఆకలేస్తే పులిహోర తింటుందా’, ‘ధర్యానికి భయమేస్తే.. దిండుకింద నా ఫోటో పెట్టుకుని పడుకుంటుంది రా ’ నేను హీరోని అంటు చెప్పే పంచ్ డైలాగులు అదిరిపోయాయి. ‘హృదయ కాలేయం’ హీరో గా మనోడి ఎంట్రీ ఎలా ఉంటుందో కానీ ట్రైలర్ లో మాత్రం ఫన్నీ డైలాగ్ లతో అదరగొట్టేస్తున్నాడు. సోమవారం హైదరాబాద్ లో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ట్రైలర్ తో సంపూర్నేష్ బాబు మళ్ళీ అదరగొట్టాడు. `సంపూర్నేష్ బాబు... ఆరడుగులు ఉంటాడు, కెలికితే అరగంటలో వచ్చేస్తాడు... ` అంటూ హీరో లెవెల్లో డైలాగులు చెప్పేశాడు. అన్నట్టు మనోడు `నేను హీరోని...` అన్నప్పుడు, వెనక జీరో అనే లైటింగ్ వెలుగుతుంటుంది. ఇప్పటికే నెట్ ప్రపంచంలో సందడి చేసిన మన సంపూర్నేష్ బాబు ఈ ట్రైలర్ తో వెబ్ దునియాలో మరో సంచలనం సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు సినిమాలోని పాటలు విడుదల చేస్తారట. ఆ వేడుకకు అందరి ముందుకు వస్తాడు సంపూర్నేష్ బాబు. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ సినీ ప్రేక్షకులు కాస్త ఓపిక పట్టాలని సినీ బృందం విజ్ఞప్తి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: